శాంతి చర్చలు జరుగుతున్న వేళ రష్యాపై దాడి చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ(Zelenskyy) స్పందించారు. ఉక్రెయన్ దళాలు రష్యాలో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అద్భుతమైన ఆపరేషన్‌ను నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ దాడి రష్యాకు భారీగా నష్టాన్ని కలిగిందని అన్నారు. అంతేకాకుండా దీనిని సమర్ధమైన దాడిగా పేర్కొన్నారు. ఆదివారం దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సైనిక దళాలకు, ఆపరేషన్‌లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన దళాల అధిపతి నుంచి నివేదిక అందింది. శత్ర భూభాగంలో ఒక అద్భుతమైన ఆపరేషన్ జరిగింది. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ముఖ్యంగా, ఉక్రెయిన్ చేసిన దాడుల వల్ల రష్యా గణనీయమైన నష్టాలను చవిచూసింది. ఈ ఆపరేషన్‌లో 117 డ్రోనలను ఉపయోగించాం. ఆపరేషన్ ప్రణాళిక కోసం ఏడాదిన్నర సమయం పట్టింది. ప్లాన్ చేసిన ప్రకారంగానే రష్యాపై ఉక్రెయిన్ దళాలు పూర్తిగా అమలు చేశాయి. ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్ అని నేను ఖచ్చితంగా చెబుతా. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆపరేషన్ గురించి బహిరంగంగా చెప్పడం. మేం ఆపరేషన్ చేపట్టిన ఆఫీస్, రష్యన్ భూభాగంలోని ఎఫ్ఎస్బీ కార్యలయానికి పక్కనే ఉంది. ఇక ఈ దాడికి సాయం చేసిన వారిని ఆపరేషన్‌కు ముందు రష్యా నుంచి తీసుకొచ్చాం. వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. ఏడాదిన్నర శ్రమ ఫలించినందుకు సంతృప్తిగా ఉంది. మేం ఈ దాడులను కొనసాగిస్తాం అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.

500 డ్రోన్ల దాడికి ఎదురుదెబ్బ
ఈ ఆపరేషన్ చేపట్టడానికి ముందే రష్యా మరో దాడికి సిద్ధమవుతోందని తమకు నిఘా సమాచారం అందినట్లు జెలెన్ స్కీ తెలిపారు. రెండు రోజుల్లోనే దాదాపు 500 డ్రోన్లను రష్యా ప్రయోగించిదని అన్నారు. వారు చేసే ప్రతి దాడికి డ్రోన్ల సంఖ్యను పెంచతుందని చెప్పారు. అంతేకాకుండా కాలిబర్ క్షిపణులను కూడా సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని, ప్రజలను మేం రక్షించుకుంటామని వెల్లడించారు. జెలెన్‌స్కీ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది – ఉక్రెయిన్, రష్యా చేస్తున్న దాడులకు కళ్లెం వేయడమే కాదు, దానికి ప్రతిఘటనగానూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని. శత్రు భూభాగంలో చేసిన ఈ మిషన్, ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని, నిఘా స్థాయిని మరోసారి చూపించింది.
Read Also: Asaduddin Owaisi: మరోసారి పాకిస్థాన్ విధానాలపై ఒవైసీ తీవ్ర విమర్శలు