📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Zambia: అంత్యక్రియలకు నోచుకోని జాంబియా మాజీ అధ్యక్షుడి పార్థివదేహం

Author Icon By Vanipushpa
Updated: June 26, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా మనిషి చనిపోయిన వెంటనే అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. ఒకవేళ చనిపోయిన వాళ్ల బంధువులు వేరే ప్రాంతాల్లో ఉన్నా, వారు వేరే ప్రాంతంలో చనిపోయినా మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించే వరకు అంత్యక్రియలను నిలిపి వేస్తుంటారు. కానీ కుటుంబ సభ్యుల దగ్గరే ఆ దేశ మాజీ అధ్యక్షుడి మృతదేహం ఉన్నప్పటికీ 20 రోజులుగా అంత్యక్రియలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం ఉన్న సర్కారు, కుటుంబ సభ్యులకు మధ్య అంత్యక్రియల విషయంలో వివాదం చెలరేగింది. దీని వల్లే ఇన్ని రోజులుగా ఆయన అంత్యక్రియలు నిలిచిపోయాయి.

Zambian: అంత్యక్రియలకు నోచుకోని జాంబియా మాజీ అధ్యక్షుడి పార్థివదేహం

హిచిలేమాపై దేశద్రోహం అభియోగాలు
ఆఫ్రికా దేశమైన జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్రగ్ లుంగూZambia Ex-president Edger lungu) 2015 నుంచి 2021 వరకు జాంబియా అధ్యక్షుడి(Zambia President)గా పని చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన హిచిలేమాను ఓడించి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత హిచిలేమాపై దేశద్రోహం అభియోగాలు మోపి ఆమెను నాలుగు నెలలు జైల్లో వేశారు. దీంతో అంతర్జాతీయ వ్యాప్తంగా లుంగూపై విమర్శలు వచ్చాయి. 2021 ఎన్నికల్లో హిచిలేమా చేతిలో లుంగూ ఓడిపోయారు. ఆ తర్వాత హిచేలామా(Hichilamaa) ప్రభుత్వం.. గతేడాది లుంగూ గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఆయన ఆరోపించారు. ఇలా ఇద్దరి మధ్య చాలా రోజులుగా రాజకీయ వైరం కొనసాగుతోంది.
ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన లుంగూ జూన్ 5వ తేదీన ప్రాణాలు కోల్పోయారు. 68 ఏళ్ల వయసు కల్గిన ఆయన దక్షిణాఫ్రికా ఆసుపత్రిలో మరణించారు. ముఖ్యంగా తాను భవిష్యత్తులో చనిపోతే అంత్యక్రియలకు హిచిలేమా హాజరు కాకూడదని లుంగూ గతంలోనే స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అంత్యక్రియలకు రానివ్వమని తేల్చి చెప్పారు. కానీ ప్రస్తుతం ఆమె అధికారంలో ఉండడం, చనిపోయింది ఓ మాజీ అధ్యక్షుడు కావడంతో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. దీన్ని లుంగూ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
మేమే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ గొడవ
మేమే ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ గొడవ చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ ప్రైవేటు శ్మశాన వాటికలో ఏర్పాట్లు కూడా చేశారు. లుంగూకు చెందిన పార్టీ నేతలు కూడా ఇక్కడకు చేరుకున్నారు. కానీ ప్రభుత్వ లాంఛనాలతో నిర్మిస్తామని సర్కారు వీటిని అడ్డుకుంది. ఇలా ఇప్పటికే రెండు సార్లు అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. జూన్ 25వ తేదీన తాజాగా జరగాల్సి ఉండగా.. అంత్యక్రియలకు గంట ముందు వాటిని ఆపాలని కోరుతూ.. జాంబియా అటార్నీ జనరల్ ములిలో కబేషా దక్షిణాఫ్రికా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లుంగూ మృతిని గౌరవంగా స్మరించుకోవాలని, జాంబియా పౌరులందరూ నివాళులర్పించే అవకాశం కల్పించాలని పిటిషన్‌లో కోరారు. ఇప్పటికే అధ్యక్షులు అందరినీ ఖననం చేసే స్మశాన వాటికలో లుంగూ కోసం సమాధిని కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. అయితే ఆలోపే ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని అక్కడి రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: Iran-Israel war : ఇరాన్ నుంచి మరో 296 మంది భారతీయుల తరలింపు

#telugu News Ap News in Telugu body Breaking News in Telugu denied former funeral Google News in Telugu Latest News in Telugu Paper Telugu News president Telugu News online Telugu News Paper Telugu News Today zambia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.