📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Muhammad Yunus: నేపాల్‌తో యూనస్ భేటీ ..భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: May 14, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌(Bangladesh) లో షేక్ హసీనా (Shaik Hasina) ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అధికారాన్ని చేపట్టిన మహమ్మద్ యూనస్.. (Muhammad Yunus) భారత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ.. రోజుకో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనా(Pakistan, China) లకు దగ్గరవుతున్న యూనస్.. భారత్‌తో వివాదం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేపాల్(Nepal) ప్రతినిధుల సభ డిప్యూటీ స్పీకర్‌తో భేటీ అయిన మహమ్మద్ యూనస్.. మరోసారి వివాదానికి తెరలేపారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌తోపాటు భారత్‌లోని 7 ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ కలిసి ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ పేర్కొనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపురలను సెవెన్‌ సిస్టర్స్‌ అని పిలుస్తారు.

Muhammad Yunus: నేపాల్‌తో యూనస్ భేటీ ..భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు

చెలరేగిన వివాదం
బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్ కోసం ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళిక ఉండాలని.. విడివిడిగా ఉండటం కంటే కలిసి ఉంటే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని మహమ్మద్ యూనస్ అనడంతో వివాదం చెలరేగింది. జలవిద్యుత్, ఆరోగ్య సంరక్షణ, రోడ్డు కనెక్టివిటీ రంగాల్లో సరిహద్దు సహకారం తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందని బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత హితవు పలికారు.
బంగ్లాదేశ్, నేపాల్ దేశాల మధ్య జలవిద్యుత్ సహకారాన్ని మరింత పెంచుకోవడంపై రెండు దేశాల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే యూనస్ సెవెన్ సిస్టర్స్‌పై వ్యాఖ్యలు చేశారు. భారతీయ గ్రిడ్‌ను ఉపయోగించి నేపాల్ నుంచి బంగ్లాదేశ్‌కు 40 మెగా వాట్ల జలవిద్యుత్‌ను దిగుమతి చేసుకునేందుకు గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్-నేపాల్-భారత్ త్రైపాక్షిక విద్యుత్ అమ్మకాల ఒప్పందం చేసుకున్నాయి. 3 దేశాలు సంతకం చేశాయి. ఆ ఒప్పందం ప్రాముఖ్యతను బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు గుర్తించాయి. అయితే ఈ ప్రాంతంలోని దేశాలు కలిసి పనిచేస్తే ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందవచ్చని ఈ సందర్భంగా యూనస్ వెల్లడించారు.
సముద్రానికి తామే రక్షకులం
మరోవైపు.. గత నెలలో చైనాలో పర్యటించిన మహమ్మద్ యూనస్‌.. బంగ్లాదేశ్‌లో చైనా కార్యకలాపాలు మరింత విస్తరించుకోవచ్చని వారికి బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదు. దీంతో ఆ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని.. అందుకే చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మహమ్మద్ యూనస్ చైనాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

Read Also: Blocked In India: భారత్​లో గ్లోబల్ టైమ్స్​, జిన్హువా ఎక్స్​ ఖాతాలు బ్లాక్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu comments on India controversial Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Yunus's meeting with Nepal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.