అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మనవరాలికే బీటేశాడు ఓ యువకుడు. ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్(Kai)(18)ను లేపుకెళ్లి పెళ్లిచేసుకోవాలని ప్లాన్ వేశాడు. కాయ్ ఉంటున్న ఎస్టేట్ లోకి గోడ దూకి ప్రవేశించాడు. అయితే అతడ్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ ను పెళ్లిచేసుకునేందుకు వచ్చానని చెప్పడంతో వాళ్లంతా షాక్ అయ్యారు.
ఎస్టేట్ గోడ దూకే యత్నం
అమెరికాలోని టెక్సాస్ కు చెందిన 23 ఏళ్ల ఆంటోనీ థోమస్ రీయస్ మామూలోడు కాదు. ఏకంగా దేశాధ్యక్షుడు ట్రంప్ మనవరాలు కాయ్ ట్రంప్ మీదనే కన్నేశాడు. ఆమెను లేపుకెళ్లి పెళ్లిచేసుకోవాలని ప్లాన్ వేశాడు. కాయ్ ఉంటున్న మార్-ఏ- లాగో అనే ఎస్టేట్ గోడ దూకే యత్నం చేశాడు. కానీ అక్కడి సిబ్బంది థోమస్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్ మనవరాలు నివాసం ఉంటున్న మార్- ఏ- లాగో ఎస్టేట్ లోకి గోడ దూకి రహస్యంగా ప్రవేశించబోయిన థోమస్ రియస్ ను పాల్మ్ బీచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇలా ఎందుకు చేశావని విచారించగా.. తాను ట్రంప్ మనవరాలిని పెళ్లిచేసుకోవాలని దేవుడు చెప్పాడు.. అని థోమస్ చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. అయితే థోమస్.. మార్- ఏ- లాగో ఎస్టేట్ లోకి ప్రవేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దేవుడు ఇచ్చిన ఈ సందేశాన్ని వివరించి.. కాయ్ ట్రంప్ ను పెళ్లిచేసుకోవాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ఉన్నారు. మరోవైపు థోమస్ గతంలోనూ ఇలాంటి పనులకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.
ఫ్లోరిడాలోని మార్- ఏ- లాగో ఎస్టేట్ డొనాల్డ్ ట్రంప్ శాశ్వత నిలయంగా చెబుతుంటారు. ఆయన ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఈ ఎస్టేట్ కు వస్తుంటారు. ఈ ప్రాపర్టీని లోకల్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అనే సిబ్బంది పర్యవేక్షిస్తుంటుంది. మరోవైపు ఇది సెక్యూరిటీ లోపంగా కొంతమంది భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై చాలాసార్లు హత్యాయత్నం జరిగింది. గతేడాది జులై 13న ఆయనపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ రెప్పపాటులో బుల్లెట్ నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆయన చెవి గుండా బుల్లెట్ దూసుకెళ్లింది.
Read Also: Sana: యూట్యూబర్ సనాను ఎందుకు హత్య చేశారు?