📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Yogandhra: విజయవంతంగా ముగిసిన యోగాంధ్ర పేరిట 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు

Author Icon By Anusha
Updated: June 22, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన “యోగాంధ్ర” కార్యక్రమం రాష్ట్ర స్థాయిలోనే కాదు, దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలతో కలిసి యోగా చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం అనేక రికార్డులను సృష్టిస్తూ ఘన విజయాన్ని నమోదు చేసింది.యోగా డే సందర్బంగా సుమారు 27 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించి రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా విశాఖపట్నం సహా ఏపీ వ్యాప్తంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం రెండు గిన్నిస్‌ రికార్డులు, 21 వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులు కలిపి మొత్తం 23 రికార్డులు సాధించి చరిత్ర సృష్టించింది. యోగాంధ్ర కార్యక్రమం రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించింది.

ఒకే వేదికపై

ఒకే వేదికపై ఎక్కువ మంది ప్రజలు యోగా సాధన చేసినందుకు గాను, అలానే ఎక్కువ మంది విద్యార్థులు ఒకే వేదికపై సూర్య నమస్కారాలు చేసినందుకు మరో గిన్నిస్ రికార్డు సృష్టించింది.యోగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో నమోదు,వ్యక్తిగతంగా భారీ సంఖ్యలో యోగా శిక్షణ తీసుకోవడం,2 కోట్ల మందితో లక్ష ప్రాంతాల్లో యోగా,ఎక్కువ సంఖ్యలో యోగా పోటీల నిర్వహణ,నెల వ్యవధిలోనే సముద్రం ఒడ్డున ఎక్కువ సంఖ్యలో యోగా కార్యక్రమాలు,అధిక సంఖ్యలో యోగా పోటీల (Yoga competitions) నిర్వహణ,ఒక్క రోజులో 75 స్థలాల్లో వృద్ధులు అధిక సంఖ్యలో యోగాలో పాల్గొనడం,నెల రోజుల వ్యవధిలో ధార్మిక స్థలాల్లో అధిక సంఖ్యలో యోగా కార్యక్రమాల నిర్వహణ,యోగా గురించి పెద్ద మొత్తంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం,ఒకే వేదికపై అధిక సంఖ్యలో దివ్యాంగులు యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం,నెల రోజుల వ్యవధిలోనే బౌద్ధ వారసత్వ స్థలాల్లోయోగా కార్యక్రమాల నిర్వహణ,నెల రోజుల వ్యవధిలో పురావస్తు ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు.

Yogandhra:

పెద్ద సంఖ్యలో

జైల్లో పెద్ద సంఖ్యలో యోగా నిర్వహణ,కూచిపూడి నృత్య భంగిమల్లో భారీ మానవహారం,
ఒకే కార్యక్రమంలో ఎక్కువ మంది ఆరోగ్య కార్యకర్తలు పాల్గొనడం,ఒకే వేదికపై అధిక సంఖ్యలో కుటుంబాల భాగస్వామ్యం,అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొనడం,
అధిక సంఖ్యలో గిరిజనుల భాగస్వామ్యం (Tribal participation),పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం,వృక్షాకారంలో భారీ మానవహారం,త్రికోణాసనంలో భారీ మానవహారం,ఇలా 21 ప్రపంచ రికార్డులు యోగాంధ్ర పేరిట నమోదయ్యాయి. ఇక యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.

Read Also: AP High Court: వరకట్న వేధింపుల కింద కేసు పెట్టే హక్కు ట్రాన్స్‌ఉమన్‌‌ కి ఉందన్న హైకోర్టు

#AndhraYogaCelebration #InternationalYogaDay #YogaWithModi Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.