📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

Yoga Day 2025: భారత్ లో యోగా సాధనకు ప్రసిద్ధమైన ప్రదేశాలు

Author Icon By Anusha
Updated: June 16, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. ఎంతో ప్రాచుర్యం పొందిన యోగా, ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మానసిక శాంతిని పొందడానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రత్యేకంగా ఈ రోజున యోగ సాధన మొదలుపెట్టాలనుకునేవారికి లేదా దానిని మరింత నియమబద్ధంగా కొనసాగించాలని భావించేవారికి కొన్ని శాంతియుత యోగా ప్రదేశాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.ఈ ప్రదేశాల్లో పర్యావరణం సహజంగా ప్రశాంతంగా ఉండటం వల్ల అక్కడ చేసే యోగా సాధన శరీరానికే కాదు, మనసుకూ గొప్ప శ్రేయస్సును అందిస్తుంది.

సమయం కేటాయించి

భారతదేశంలో యోగా ప్రియుల కోసంచాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని అన్వేషించి అక్కడ యోగా సాధన చేయవచ్చు. ఇక్కడ యోగా (Yoga) కూడా నేర్చుకోవచ్చు. అంతేకాదు బిజీ జీవితం నుంచి కొంత సమయం కేటాయించి అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అనేక యోగాసనాలను సాధన చేయవచ్చు. యోగా సాధన మీ శరీరానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశంలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ సహజ సౌందర్యాన్ని చూడవచ్చు.

యోగా చేయడం

అంతేకాదు ఈ ప్రదేశాలు సాహస కార్యక్రమాలకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇంట్లో లేదా దగ్గర్లోని పార్కులో యోగా చేయడం ఎవరికైనా విసుగు తెప్పిస్తే ఈ యోగా దినోత్సవం రోజున భారతదేశంలోని కొన్ని అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. పర్వతాలు, చుట్టూ ఉన్న పచ్చదనం అందమైన దృశ్యాలను చూడటంతో పాటు మీరు యోగా చేయగల ప్రదేశాలను ఎంచుకుని ఈ ప్రదేశాలను అన్వేషించవచ్చు.

రిషికేష్ – ఉత్తరాఖండ్

యోగా రాజధానిగా రిషికేశ్‌ను అని పిలుస్తారు. గంగా నది ఒడ్డుకు వెళ్లి ఇక్కడ యోగా చేయవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day) కూడా ఇక్కడ జరుపుకుంటారు. దీనికి దేశ, విదేశాల నుంచి ప్రజలు వస్తారు. రిషికేశ్‌లో యోగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ పరమార్థ నికేతన్, శివానంద్ ఆశ్రమం, సాధన మందిరం, హిమాలయ యోగా ఆశ్రమం వంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి.

ధర్మశాల-హిమాచల్ ప్రదేశ్

హిమాలయాల ఒడిలో ఉన్న ధర్మశాల యోగాకు సరైన ప్రదేశం. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ధ్యానానికి ఉత్తమమైనది. ధర్మశాల (Dharamshala) లోని సహజ సౌందర్యాన్ని ఆరాధించడం వల్ల యోగా ఆనందం మరింత పెరుగుతుంది. ఇక్కడ భాగ్సు యోగా సెంటర్, సిద్ధి యోగా, యూనివర్సల్ యోగా సెంటర్, యోగా ఇండియా వంటి కొన్ని ప్రసిద్ధ యోగా కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ యోగా నేర్చుకోవచ్చు.

పాండిచ్చేరి (ఆరోవిల్లే)

పాండిచ్చేరి సముద్రతీరంలో ఉన్న ఆరోవిల్లే అనేది ఆధ్యాత్మికత, యోగా, ధ్యానానికి ప్రసిద్ధి. పాండిచ్చేరి ఆశ్రమాలు యోగా, ధ్యానానికి ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ అనేక రకాల యోగాసనాలు నేర్పించే అనేక శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుండి భక్తులు, సాధువులు వస్తుంటారు. ఇక్కడ ‘శ్రీ అరవిందో ఆశ్రమం’ ఫేమస్.యోగా కేంద్రంలో ప్రశాంతంగా యోగా చేయవచ్చు.

గోవా

సముద్రతీరంలోని వాతావరణంలో యోగా సాధన ఒక విభిన్న అనుభవం. అనేక బీచ్‌ల పక్కన యోగా రిట్రీట్‌లు, శిక్షణ శిబిరాలు నిర్వహించబడుతుంటాయి. గోవా (Goa) లో యోగా టూరిజం ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది.యోగాకు గోవా ఉత్తమైంది. గోవాలోని ప్రకృతి సౌందర్యం, బీచ్‌లు పార్టీలకు మాత్రమే కాదు యోగాకు కూడా ఉత్తమమైనవి. ఇక్కడ యోగా నేర్చుకునే అనేక యోగా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. త్రిమూర్తి యోగా సెంటర్, లోటస్ నేచర్, కేర్, బాంబూ యోగా రిట్రీట్, హిమాలయన్ యోగా వ్యాలీ వంటి అనేక రిట్రీట్‌లు, యోగా కేంద్రాలు గోవాలో ఉన్నాయి.

కేరళ

కేరళలోని బ్యాక్‌వాటర్స్, హిల్ స్టేషన్లు యోగా సాధనకు ఉత్తమమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. ఆయుర్వేద చికిత్సలు, పంచకర్మతో కలిపి యోగా అనుసంధానం చేయడం ఇక్కడ ప్రత్యేకత.కేరళ (Kerala) దాని సహజ సౌందర్యానికి మాత్రమే కాదు ఆయుర్వేద చికిత్స , యోగాకు కూడా ప్రసిద్ధి చెందింది. యోగా ప్రియులకు ఇంతకంటే ప్రశాంతమైన , అందమైన ప్రదేశం మరొకటి ఉండదు. ఈ నగరంలో శివ ఋషి యోగా, ఏకం యోగ శాల, ​​ఋషికేశ్ యోగాపీఠ్ వంటి అనేక యోగా కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ ఎవరైనా సరే ఆసక్తి ఉంటే యోగాలో శిక్షణ పొందవచ్చు.

Read Also: Iran: ఇరాన్ ప్రకటనను పాక్ రక్షణ మంత్రి ఖండన

#DharamshalaYoga #GoaYogaRetreat #PondicherryYoga #RishikeshYoga Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.