📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Brics: బ్రిక్స్ సదస్సుకు చైనా అధినేత జిన్‌పింగ్ దూరం?

Author Icon By Vanipushpa
Updated: July 3, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొన్ని రోజులుగా చైనా(China) దేశాధ్యక్షుడు జిన్‌పింగ్(jinping) కనిపించడం లేదు. ఇప్పటికే దీనిపై అనేక ఊహాగానాలు ప్రచారం అవుతుండగా.. తాజాగా మరో సంచలన విషయం తెలిసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ నెల 6,7 తేదీల్లో బ్రెజిల్‌(Brazil)లో నిర్వహించే బ్రిక్స్ సదస్సు(Brics Meeting)కు కూడా హాజరు కావడం లేదు. ఆయన బదులుగా చైనా ప్రధాని లీ కియాంగ్ బ్రిక్స్ సదస్సుకు హాజరు కానున్నారు. జిన్‌పింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఈ 12 సంవత్సరాల్లో బ్రిక్స్ సదస్సుకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. గత కొన్ని రోజులుగా జిన్‌పింగ్ కనిపించకుండా పోవడం.. ఇప్పుడు బ్రిక్స్ సదస్సుకు దూరంగా ఉండటం వంటి పరిణామాలు పరిశీలిస్తే.. త్వరలోనే చైనాలో నాయకత్వం మారబోతుంది అనే ఊహాగానాలు తెర మీదకు తెస్తున్నాయి.

Brics: బ్రిక్స్ సదస్సుకు చైనా అధినేత జిన్‌పింగ్ దూరం?

జిన్‌పింగ్ హాజరుకాలేకపోవచ్చా?
ఇదే అంశంపై విలేకరులు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ను అడిగా ప్రశ్నించారు. జిన్‌పింగ్ బ్రెజిల్ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా.. అందుకు ఆమె సమాధానం దాటవేశారు. దీంతో ఆయన గైర్హాజరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జులై 6, 7 తేదీల్లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇలాంటి సమయంలో బ్రిక్స్ వేదికపై షీ జిన్‌పింగ్, ప్రధాని మోదీ పక్కపక్కన కూర్చోవడం జరిగితే, అది రెండు దేశాల వాణిజ్య, భద్రతా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

భారత్-చైనా సంబంధాల నేపథ్యం
గత సంవత్సరం రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ కలిశారు. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. ఇద్దరు నేతలు కలవడం చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించారు. అంతేకాకుండా కొన్ని ద్వైపాక్షిక అంశాలపై కూడా ఇద్దరు అంగీకారానికి రావడంతో ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు జిన్‌పింగ్ ఈ సదస్సుకు దూరం అవుతున్నారు. ఇదిలా ఉంటే బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉన్నాయి. తర్వాత ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ కూడా చేరాయి.
చైనాలో ఏం జరుగుతుంది…
గత కొంత కాలంగా చైనాతో పాటుగా ప్రపంచ మీడియాలో జిన్‌పింగ్ శకం ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో మావో జెడాంగ్ తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా జిన్‌పింగ్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. జిన్‌పింగ్ స్థానంలో మరొకరిని ఎన్నుకోవడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. మే 21 నుంచి జూన్ 5 వరకు జిన్‌పింగ్ కనిపించలేదు. ఇందుకు కారణాలు ఏంటి.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన బ్రిక్స్ సదస్సుకు గైర్హాజరు కావడం దేనికి సంకేతం.. వయసు మీద పడటంతో జిన్‌పింగ్‌ను తప్పిస్తున్నారా.. ఇది అధ్యక్షుడి మార్పుకు సంకేతమా అని కొన్ని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

అలానే జిన్‌పింగ్ స్థానంలో తదుపరి చైనా అధ్యక్షుడిగా సంస్కరణలకు మద్దతు తెలిపే వాంగ్ యాంగ్‌ని ఎన్నుకోబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జిన్‌పింగ్ ఇలా అదృశ్యం కావడం సాధారణమేనని చైనా నిఘా సంస్థలు కొన్ని చెబుతున్నాయి. అవసరమైతే ఎంటి శక్తివంతమైన అధినేతలనైనా చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కనబెడుతుందని పేర్కొంటున్నాయి. మరి ఈ ప్రచారానికి ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి.

read hindi news: hindi.vaartha.com

Read Also: Dalai Lama : వారసుడి ఎంపిక ప్రక్రియ దలైలామా చేతుల్లోనే ఉంది : భారత్‌

#telugu News Ap News in Telugu Breaking News in Telugu brics 2025 russia brics expansion news brics summit china participation brics without china china domestic issues 2025 china india brics relations Google News in Telugu India-China Border Tensions Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today xi jinping absence brics xi jinping brics summit xi jinping foreign visits 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.