📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

World Blood Donor Day: నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Author Icon By Anusha
Updated: June 14, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రక్తదానం చేయండి ప్రాణదాతకండి! – ఈ నినాదాన్ని మనలో చాలామంది విన్నాం. కానీ దీని వెనుక ఉన్న అసలైన అర్థం, ప్రాముఖ్యతను తెలుసుకుని అనుసరించేవారెందరో?
ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీను ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా (World Blood Donor Day) ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.ఇది కార్ల్ లాండిస్టైనర్ జన్మదినం. ఆయనే రక్తగ్రూప్‌లను కనుగొన్న శాస్త్రవేత్త.రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు, రక్తదాతల సేవను గుర్తించేందుకు ఈ రోజు గ్లోబల్‌గా పాటించబడుతోంది.ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తులకు ఆయుష్షు పోసేందుకు వచ్చిన గొప్ప అవకాశం రక్తదానం చేయడం.ఇప్పుడు దీనిపై అందరిలోనూ సామాజిక స్పృహ పెరుగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజులు ఇలా తదితర శుభ సందర్భాల్లో చాలా మంది రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు. వారి స్ఫూర్తితోనే కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా రక్తదానానికి ముందుకు వస్తున్నారు.

సరైన సమయం

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004 నుంచి ఏటా జూన్​ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్ప దానంగా పరిగణించబడుతుంది. శరీరంలో తగినంత రక్తం లేకపోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, సరైన సమయంలో రక్తం బాధితునికి అందుబాటులో లేకపోతే, అప్పుడు రోగి జీవితం ప్రమాదంలో పడవచ్చు. అయితే రక్తదానం ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. ఈ రోజు ప్రధాన లక్ష్యం ప్రజలలో రక్తదానం గురించి అవగాహన కల్పించడం. కనుక ఈ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.అలాగే,రక్తదానం చేయడం వల్లే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

రక్తదానం ప్రాముఖ్యత

2005లో 58వ ప్రపంచ ఆరోగ్య సభ దీనిని వార్షిక ప్రపంచ కార్యక్రమంగా ప్రకటించింది. అప్పటి నుంచి రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటున్నారు.ప్రపంచ రక్తదాతల దినోత్సవం 2025 థీమ్ ప్రతి సంవత్సరం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని (World Blood Donor Day) ఒక ప్రత్యేక ఇతివృత్తంతో జరుపుకుంటారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది అంటే 2025 సంవత్సరానికి ఇతివృత్తం “రక్తం ఇవ్వండి, ఆశను ఇవ్వండి: కలిసి మనం అందరం ప్రాణాలను కాపాడుకుందాం”. ఈ సంవత్సరం ఇతివృత్తం రక్తదానం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.

World Blood Donor Day

రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

రక్తంలో ఐరన్​ అధిక స్థాయిలో ఉంటే రక్త ప్రసరణలో అడ్డంకులతో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంది. హెమోక్రొమాటోసిస్ ​(ఐరన్​ ఓవర్​ లోడ్​) వ్యాధికి కారణం అవుతుంది.క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే శరీరంలో ఐరన్​ (Iron) స్థాయి నియంత్రణలో ఉంటుంది.రక్తదానంతో గుండె జబ్బులు తగ్గుతాయి.శరీరంలో ఐరన్‌ నిల్వల స్థాయి తగ్గడంతో పెద్ద పేగు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది.రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.కొలెస్ట్రాల్‌ తగ్గించేందుకు దోహదపడుతుంది.రక్తంలో నూతన కణాలు వృద్ధి చెంది, రోగ నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.

రక్తదానం ఎవరు చేయకూడదు

రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, హిమోగ్లోబిన్​ లోపాలు ఉన్నవారు, ఏదైనా శస్త్ర చికిత్సలు చేయించుకున్న కొద్ది రోజుల వరకు రక్తాన్ని దానం చేయకూడదు.గుండె వ్యాధులు ఉన్నవారు ఇవ్వకూడదు.తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.లైంగిక సంక్రమణ వ్యాధులుక్యాన్సర్​తో బాధపడుతున్న వారుమధుమేహ వ్యాధిగ్రస్థులుఇన్సులిన్​ తీసుకుంటున్న వారు రక్తం దానం చేయకూడదు.

Read Also: Donald Trump: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి గురించి ముందే తెలుసన్న ట్రంప్

#BeAHeroDonateBlood #BloodDonationMatters #DonateBloodSaveLives #WorldBloodDonorDay Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.