📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bandi Sanjay: ఉద్యోగాల పేరిట మయన్మార్‌కు తరలింపు..బండి సంజయ్ చొరవతో స్వదేశానికి చేరిక

Author Icon By Vanipushpa
Updated: April 22, 2025 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్యాంకాక్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మయన్మార్‌లో సైబర్ ఉచ్చులో చిక్కుకుపోయిన ముగ్గురు తెలంగాణ వాసులు, ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్వదేశానికి రప్పించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఆయన చొరవ తీసుకుని వీరిని భారత్‌కు రప్పించారు. కేంద్ర మంత్రి చొరవతో మయన్మార్‌లో ‘సైబర్ క్రైమ్’ వెట్టిచాకిరికి గురవుతున్న వారికి విముక్తి లభించింది.
బండి సంజయ్ చొరవతో స్వదేశానికి చేరుకున్న బాధితుల్లో రంగారెడ్డి జిల్లా కోహెడకు చెందిన రాకేష్ రెడ్డి, ఏ. శివశంకర్, కరీంనగర్ జిల్లాకు చెందిన కానూరి గణేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకుల గురు యువ కిశోర్ ఉన్నారు.

రోజుకు 16 గంటల పాటు పని
వివరాల్లోకి వెళితే, అధిక వేతనాలతో బ్యాంకాక్‌లో ఉద్యోగాలంటూ కొందరు బ్రోకర్లు ఈ యువకులను నమ్మించారు. తీరా వారిని మయన్మార్‌కు తరలించి, అక్కడ సైబర్ మోసాలు చేసేందుకు బలవంతం చేశారు. రోజుకు 16 గంటల పాటు పనిచేయించుకుంటూ, ఎదురు తిరిగితే చిత్రహింసలకు గురిచేసేవారని బాధితులు వాపోయారు. కోహెడకు చెందిన రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ, తమను జగిత్యాలకు చెందిన వంశీకృష్ణ అనే ఏజెంట్ మోసం చేశాడని చెప్పారు. అక్కడకు వెళ్లాక పని చేయనన్నందుకు తన పాస్‌పోర్ట్ లాక్కుని, ఆహారం కూడా పెట్టకుండా హింసించారని, చివరకు దొంగలుగా చిత్రీకరించి అక్కడి ఆర్మీకి అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
స్పందించిన బండి సంజయ్
తనలాంటి బాధితులను బండి సంజయ్ చాలామందిని రక్షించారని తెలుసుకుని, తన తండ్రి ద్వారా కేంద్ర మంత్రి కార్యాలయాన్ని సంప్రదించామని రాకేశ్ రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే బండి సంజయ్ స్పందించి, విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసి తమను విడిపించేందుకు చర్యలు తీసుకున్నారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఇంకా అనేక మంది తెలుగు రాష్ట్రాల యువతతో పాటు వందలాది భారతీయులు మయన్మార్‌లో ఇలాంటి సైబర్ వెట్టి చాకిరిలో చిక్కుకున్నారని సమాచారం ఉందని, వారిని కూడా సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. యువత ఇలాంటి బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు.

Read Also: Nepal: నేపాల్‌లో మళ్లీ రాచరికంపై పోరాటం.. భారత్‌పై ప్రభావం ఉంటుందా?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today With the initiative of Bandi Sanjay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.