📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Viral Video: చెంపదెబ్బ కొట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడికి భార్య

Author Icon By Vanipushpa
Updated: May 27, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫ్రాన్స్(France) అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్‌‌(Immanuel Macron), ఆయన భార్య బ్రిగెట్టి(Brigitte) మధ్య విమానంలో జరిగిన చిన్నపాటి గొడవకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌గా మారింది. మెక్రాన్ వియత్నాం(Vietnam) పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసియా పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అద్యక్షుడు మెక్రాన్ దంపతులు వియత్నాం చేరుకున్న సమయంలో విమానం దిగుతుండగా ఈ ఘటన జరిగింది. హనోయ్ విమానాశ్రయంలో ల్యాండైన అనంతరం విమానం తలుపులు తెరవగానే బ్రిజిట్ తన చేతులతో మెక్రాన్ ముఖంపై కొట్టినట్టు కనిపించింది. అప్పటికే ఇరువురి మధ్య గొడవ జరిగినట్టు.. ఆమెతో కాస్త గట్టిగా మాట్లాడుతున్నట్లు కూడా మెక్రాన్ కనిపించాడు. భార్య చేతులు తన మొహానికి తగలడంతో.. వెంటనే ఆయన తన తలను పక్కకు జరిపారు.

Viral Video: చెంపదెబ్బ కొట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడికి భార్య

ఇరువురి మధ్య వాదన
ఆ వెంటనే ఆయన షాకైనట్టు కనిపించారు. ఆపై వెంటనే తేరుకుని దిగే ముందు కెమెరాలకు అభివాదం చేశారు. అనంతరం బ్రిజిట్‌కు ఆయన చేయి అందించినా, ఆమె మాత్రం రైలింగ్ పట్టుకుని దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇరువురి మధ్య వాదన జరిగినట్టు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. ‘భర్తను బ్రిజిట్ కొట్టడం ఇది నిజంగా శోచనీయం’ అని ఒకరు.. ‘బయటే ఇలా ఉంటే లోపల ఏం జరుగుతుందో?’ అని మరొకరు.. ‘మెక్రాన్ ముఖంపై ఏదో పడుతుంటే తుడుచుకున్నట్టు ఉంది.’ అని ఇంకొకరు.. అంటే.. ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాకపోయినా.. వింతగా ఉందని పలువురు పోస్ట్‌లు పెట్టారు.

ఫ్రాన్స్ అధ్యక్ష భవనం వివరణ
ఈ వీడియోపై ఫ్రాన్స్ అధ్యక్ష భవనం వివరణ ఇచ్చింది. తప్పుడు సమాచారం అని తేల్చే ప్రయత్నం చేసింది. అటు, ఈ వైరల్ వీడియోపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్‌ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ వీడియోలో నిజం లేదని చెప్పారు. తన భార్య తననను కొట్టలేదని, తాము ఎప్పుడూ ఇలాగే సరదాగా గొడవపడతామని అన్నారు. కానీ, ఆ వీడియోలో సీరియస్‌నెస్‌ చూస్తే మాత్రం మెక్రాన్‌ కవర్ చేసుకుంటున్నారని స్పష్టమవుతోందంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించడం గమనార్హం.
‘ఇది చిన్నపాటి గొడవ’ అని వివరణ
అయితే ఫ్రెంచ్ మీడియా వర్గాలు మాత్రం ఘటనను ధ్రువీకరించడం గమనార్హం. లైవ్ స్ట్రీమ్ ద్వారా ఈ సంఘటన స్పష్టంగా కనిపించిందని తెలిపాయి. అధ్యక్షుడికి సమీపంగా ఉన్న వ్యక్తి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది చిన్నపాటి గొడవ’ అని వివరణ ఇచ్చారు. పర్యటన ప్రారంభమయ్యే ముందు మెక్రాన్ దంపతులు సరదాగా గొడవపడ్డారని చెప్పారు. కాగా, ఇటీవలి కాలంలో ఫ్రాన్స్ అధినేత మెక్రాన్‌పై రష్యా మీడియాలో తప్పుడు కథనాలు, డీప్‌ఫేక్స్ ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో మరింత దృష్టిని ఆకర్షించింది.

Read Also: Gaza: మూడు నెలల తర్వాత గాజాలో కొనసాగుతున్న సాయం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News slapped Telugu News online Telugu News Paper Telugu News Today Wife of French President

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.