📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Khamenei: ఖమేనీ భద్రత, ఆయన వారసత్వంపై పెద్ద ఎత్తున చర్చలు

Author Icon By Vanipushpa
Updated: June 18, 2025 • 1:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల ముధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కారణం అయ్యాయి. ముఖ్యంగా ఇరాన్(Iran) సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, అతడిని చంపడం అంత పెద్ద పనేమీ కాదంటూ ట్రంప్ వ్యాఖ్యానించగా.. ఖమేనీ(Khamenei) భద్రత, ఆయన వారసత్వంపై పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి.
ఇరాన్ పాలనా పగ్గాలు ఎవరు చేపడతారనే ప్రశ్న
ముఖ్యంగా ఈ యుద్ధంలో (ఇటు అమెరికా చేతిలో కానీ, అటు ఇజ్రాయెల్ చేతిలో కానీ ఖమేనీ హతమైతే.. ఇరాన్ పాలనా పగ్గాలు ఎవరు చేపడతారనే ప్రశ్న ప్రస్తుతం తెరపైకి వస్తోంది. ఇరాన్‌లో తెర వెనుక సుప్రీం లీడర్ వారసత్వ పోరు తీవ్రంగా సాగుతున్నట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాలు నివేదిస్తున్నాయి. మరి ఖమేనీ తర్వాత ఈ కీలక పదవిని దక్కించుకోవాలని ఎవరు చూస్తున్నారు, ఎవరికి దక్కే అవవకాశం ఉందో?

Khamenei: ఖమేనీ భద్రత, ఆయన వారసత్వంపై పెద్ద ఎత్తున చర్చలు

మొజ్తబా ఖమేనీ
ఖమేనీ వారసులుగా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో మొదటివారు ఖమేనీ 55 ఏళ్ల కుమారుడు మొజ్తబా ఖమేనీ. ఈయన మధ్యస్థాయి మత నాయకుడు అయినప్పటికీ.. ఇరాన్ భద్రతా, రాజకీయ వ్యవహారాలను తెర వెనుక నుండి సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. సుప్రీం లీడర్ కార్యాలయంలో రాజకీయ-భద్రతా వ్యవహారాల డిప్యూటీగా అలీ అస్గర్ హెజాజీ పని చేస్తున్నారు. అయితే ఈయనకు దేశ భద్రతా కార్యకలాపాలు, నిఘా వ్యవస్థపై గణనీయమైన ప్రభావం, పర్యవేక్షణ ఉంది.

మొహమ్మద్ గోల్పాయెగని
మొహమ్మద్ గోల్పాయెగని.. ఖమేనీ కార్యాలయంలో దీర్ఘ కాలంగా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. అయితే ఈయనకు వ్యవస్థపై లోతైన జ్ఞానంతో పాటు ఖమేనీ పట్ల అపారమైన విధేయత ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు.
అలీ అక్బర్ వెలాయతి
ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి అయిన వెలాయతి, ఖమేనీకి విదేశాంగ వ్యవహారాలపై సీనియర్ సలహాదారుగా ఉన్నారు. ఈయనకు మత పరమైన జ్ఞానం, ప్రభుత్వ స్థాయిలో విస్తృత అనుభవం రెండూ ఉన్నాయి.
అలీ లారిజాని
ఇరాన్ మాజీ పార్లమెంట్ స్పీకర్, ప్రభుత్వ ప్రసార సంస్థ మాజీ అధిపతి అయిన లారిజాని, ఆచరణాత్మక విధానాలతో పాటు ఖమేనీతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు.ఈ కీలక నాయకులలో ఎవరు సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపడతారు అనే దానిపై కూడా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఇందులోని ఒకరే ఇరాన్ భవిష్యత్తును, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో దాని పాత్రను నిర్ణయించే నాయకుడు అవుతారంటూ వివరిస్తున్నారు.

తర్వాతి సుప్రీం లీడర్ ఎవరు అవుతారు?
వారసత్వ పోరు ముగింపు ఎలా జరుగుతుంది? ఈ పదవికి ఎంపిక ఎక్స్పర్ట్ అసెంబ్లీ (Assembly of Experts) ద్వారా జరుగుతుంది. ఇది 88 మతగురువులతో కూడిన మండలి. వారు ఖమేనీ తరువాతి వారసుడిని ఎన్నుకుంటారు. వాస్తవాధారంగా చూసినపుడు, మోజ్తబా ఖమేనీ అధికారికంగా సరైన మత విద్యను పూర్తిచేయకపోవడం, రాజ్యాంగానికి విరుద్ధంగా కుటుంబ వారసత్వ పాలన ఏర్పడేలా చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఆయనకు IRGC మద్దతు ఉండటం, వ్యవస్థపై చెరిపోలేని ప్రభావం ఉండటం వల్ల అవకాశాలు మాత్రం కలిగే ఉన్నాయి.

Read Also: WhatsApp: ఇరాన్ ప్రభుత్వ హెచ్చరిక: “వాట్సాప్‌ను వెంటనే తొలగించండి!”

    #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu over Khamenei's Paper Telugu News security and legacy Telugu News online Telugu News Paper Telugu News Today Widespread debate

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.