📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pope: పోప్ రేసులో వున్నవారు ఎవరు..ఇందుకు కావాల్సిన అర్హతలు ఏమిటి?

Author Icon By Vanipushpa
Updated: April 25, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాబోయే పోప్ ఎవరు? ఈ నిర్ణయం కాథలిక్ చర్చ్ మీద, ప్రపంచంలోని 140 కోట్ల రోమన్ క్యాథలిక్కుల మీద ప్రభావం చూపుతుంది. పోప్ ఫ్రాన్సిస్ వారసుడు ఎవరనేది ఊహించడం దాదాపు అసాధ్యం. అంతే కాదు ఇది అనేక కారణాల వల్ల బహిరంగంగా జరిగే వ్యవహారం కూడా. కార్డినల్స్ కాలేజీలో సభ్యులంతా సిస్టైన్ చాపెల్‌లో సమావేశమై చర్చలు జరిపి తాము మద్దతిస్తున్న అభ్యర్థికి ఓటు వేస్తారు. అలా ఒకే పేరు వచ్చేవరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కార్డినల్స్ కాలేజీలో ఉన్న కార్డినల్స్‌లో 80 శాతం మంది, పోప్ ఫ్రాన్సిస్ నియమించినవారే. వాళ్లు తొలిసారిగా పోప్‌ ఎన్నికలో పాల్గొనడమే కాదు, విస్తృత ప్రపంచ దృక్పథాన్ని అందించబోతున్నారు.

పోప్ ఎన్నికలో పాల్గొంటున్న కార్డినల్స్‌లో సగం కంటే తక్కువ మంది యురోపియన్లు ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి. కార్డినల్స్ కాలేజ్‌లో ఎక్కువమంది పోప్ ఫ్రాన్సిస్ నియమించిన వారే అయినప్పటికీ, వారంతా “ఆధునిక” లేదా “సంప్రదాయవాదులు” కాదు. ఈ కారణాల వల్ల, తర్వాతి పోప్ ఎవరనేది అంచనా వేయడం కష్టం. కార్డినల్స్ ఆసియన్‌ను లేదా ఆఫ్రికన్‌ను పోప్‌గా ఎన్నుకోగలరా? లేక వాటికన్ పూర్వ పాలకుల్లో ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తారా? పోప్ ఫ్రాన్సిస్ వారసుడు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న వారిలో కొంతమంది పేర్లు ఇవి.
పియత్రో పారోలిన్, జాతీయత: ఇటాలియన్: మృదువుగా మాట్లాడే ఇటాలియన్ కార్డినల్ పారోలిన్, పోప్ ఫ్రాన్సిస్ హయాంలో వాటికన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అది ఆయనను పోప్‌కు ముఖ్య సలహాదారుగా మార్చింది. చర్చ్ కేంద్ర పాలనా విభాగమైన రోమన్ క్యురియాకు కూడా విదేశాంగమంత్రి నాయకత్వం వహిస్తారు. పోప్‌కు డిప్యూటీగా సమర్థవంతంగా పని చేయడంతో, పోప్‌ ఎవరనే పోటీలో ఆయన ముందున్నారు. ఆయన క్యాథలిక్ సిద్ధాంతం కంటే దౌత్యం, ప్రపంచ దృక్పథానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. అది బలమని మద్దతుదారులు నమ్మితే, అదే సమస్యనేది విమర్శకుల అభిప్రాయం.

లూయీస్ ఆంటోనియో గోకిమ్ టగ్లే, జాతీయత: ఫిలిప్పినో: కార్డినల్ టగ్లేకు దశాబ్ధాలుగా మతంతో సంబంధం ఉంది. ఆయన వాటికన్ దౌత్యవేత్త గానో, లేదంటే చర్చి చట్టంలో నిపుణుడిగా కాకుండా ప్రజల్లో క్రియాశీల చర్చి నాయకుడుగా ఉన్నారు. ఫిలిప్పీన్స్‌లో చర్చి ప్రభావం ఎక్కువ. దేశ జనాభాలో 80శాతం మంది క్యాథలిక్కులు. ఫిలిప్పీన్స్ నుంచి ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఐదుగురు కార్డినల్స్ ఉన్నారు. వాళ్లంతా కార్డినల్ టగ్లేకు మద్దతిస్తే అది బలమైన వర్గాన్ని కూడగట్టేందుకు బాటలు వేస్తుంది. కార్డినల్ టగ్లేను ఆధునిక క్యాథలిక్కుగా భావిస్తారు. అలాగే ఆయనను “ఏషియన్ ఫ్రాన్సిస్” అని పిలుస్తారు. 2013లో పోప్ ఫ్రాన్సిస్ ఎన్నిక జరిగినప్పుడు, కార్డినల్ టగ్లేను పోప్ అభ్యర్థిగా భావించారు. పదేళ్ల కిందట, తర్వాత పోప్‌గా మీరుండాలనే ప్రతిపాదనను ఎలా చూస్తారని అడిగినప్పుడు “అదొక జోక్‌గా భావిస్తాను. చాలా తమాషాగా ఉంటుంది” అని ఆయన సమాధానమిచ్చారు.
ఫ్రిడోలిన్ అంబోంగో బెసుంగు, జాతీయత: కాంగోలీస్: తర్వాతి పోప్ ఆఫ్రికా నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్రికాలో క్యాథలిక్ చర్చ్ లక్షల మందిని సభ్యులుగా చేర్చుకుంటోంది. కార్డినల్ అంబోంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన వ్యక్తి. ఆయన కిన్షాసాలో ఏడేళ్లు ఆర్చ్ బిషప్‌గా ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఆయనను కార్డినల్‌గా నియమించారు. బెసుంగు సాంస్కృతిక సంప్రదాయవాది. సమ లైంగికుల వివాహాలను వ్యతిరేకించారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మెజారిటీ ప్రజలు క్రైస్తవులైనప్పటికీ, అక్కడి జిహాదీ గ్రూపులు, ఇస్లామిక్ స్టేట్, వారితో అనుబంధంగా ఉన్న రెబెల్స్ నుంచి ప్రాణ భయం, హింసను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా కార్డినల్ బెసుంగును క్రైస్తవులకు బలమైన మద్దతుదారుగా భావిస్తున్నారు. అయితే 2020లో ఓ ఇంటర్వ్యూలో ఆయన మతపరమైన బహుళత్వానికి అనుకూలంగా మాట్లాడారు. “ప్రొటెస్టెంట్లను ప్రొటెస్టెంట్లుగా ముస్లింలను ముస్లింలుగా ఉండనివ్వండి. మేము వారితో కలిసి పని చేస్తాం. అందరికీ వారి సొంత గుర్తింపు ఉండాలి” అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల క్యాథలిక్ చర్చ్ లక్ష్యాన్ని ఆయన పూర్తిగా స్వీకరిస్తారా అని కొంతమంది కార్డినల్స్ సందేహించవచ్చు.
పీటర్ కోడ్వో అపియా టర్క్‌సన్, జాతీయత: ఘనేయన్: సహచరులు ఎన్నుకుంటే, కార్డినల్ టర్క్‌సన్ 1500 ఏళ్లలో తొలి ఆఫ్రికన్ పోప్‌గా గుర్తింపు పొందుతారు. కార్డినల్ బెసుంగు మాదిరిగానే ఆయన కూడా తాను పోప్ కావాలని భావించడం లేదని చెప్పారు. “ఎవరైనా పోప్ కావాలని కోరుకుంటారో లేదో నాకు తెలియదు” అని ఆయన 2013లో చెప్పారు.

Read Also: Pehalgam : పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఆంక్షలు


#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in the race for Pope? Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Who are the people

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.