📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

India US: భారత్‌ తో వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ కీలక ప్రకటన

Author Icon By Vanipushpa
Updated: July 1, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండో-పసిఫిక్(Indo-Pacific) ప్రాంతంలో తమకు భారత్‌ కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్(White House) పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా కొనియాడింది. భారత ఉపఖండం, ఆసియా-పసిఫిక్(Asua-Pacific) ప్రాంతం జియోపాలిటికల్ పరంగా వేగంగా మారుతున్న వేళ భారత్-అమెరికా బంధాలపై వైట్ హౌస్ చేసిన ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. వైట్ హౌస్​లో ప్రెస్ సెక్రటరీ కెరోలైన్ లీవిట్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ‘ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తోంది?’ అని ఓ విలేకరి అడగ్గా కెరోలైన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాకు భారత్ అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామి
ఇండో-పసిఫిక్ భద్రతను నిర్ణయించే కీలక భాగస్వామిగా భారత్ ఉందని కెరోలైన్ పేర్కొన్నారు. ‘ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు భారత్ అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామి. అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధానమంత్రి మోదీతో వ్యక్తిగతంగా చాలా మంచి అనుబంధం ఉంది. అది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది’ అని అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో వైట్ హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

US: భారత్‌ తో వాణిజ్య ఒప్పందంపైనా వైట్ హౌస్ కీలక ప్రకటన

వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ ప్రకటన
మరోవైపు వాణిజ్య ఒప్పందంపైనా కెరోలైన్ లీవిట్ కీలక ప్రకటన చేశారు. ఇండియా – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై మరో విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ లీవిట్ ఇలా అన్నారు. ‘భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుదిదశలో ఉందని అధ్యక్షుడు గత వారం చెప్పారు. నేను కూడా కామర్స్ సెక్రటరీతో జరిగిన చర్చలను చూశాను.
దిల్లీలో QUAD శిఖరాగ్ర సమావేశం
ఇదిలా ఉండగా, ఈ ఏడాది చివరిలో QUAD శిఖరాగ్ర సమావేశం దిల్లీలో జరగనుంది. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించగా అంగీకరించారు. మోదీ ఆహ్వానం మేరకు ఈ ఏడాది చివరలో భారత్‌లో జరగనున్న క్వాడ్ సమ్మిట్‌కు ట్రంప్ హాజరుకానున్నారు. మోదీ ఆహ్వానాన్ని ట్రంప్ సంతోషంగా స్వీకరించినట్లు, భారత విదేశీ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు.
భారత్ కీలక పాత్ర
క్వాడ్ (QUAD) అనేది భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మధ్య ఉండే వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇది స్థిరమైన, వృద్ధి చెందే ఇండో-పసిఫిక్‌ను నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇది 2004లో సునామీ సమయంలో మానవతా సాయం కోసం ఏర్పడింది. క్రమేపి ఆసియా -పసిఫిక్ ప్రాంతంలో ఒక వ్యూహాత్మక కూటమిగా మారింది. ఈ కూటమి ఇప్పుడు భద్రత, సముద్ర నిర్వహణ, ఉచిత వాణిజ్యం, టెక్నాలజీ భాగస్వామ్యం వంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ పరిణామాలన్నీ చూస్తే, అమెరికా, పశ్చిమ దేశాలు, జపాన్ వంటి దేశాల సహకారంతో ఇండో-పసిఫిక్ భద్రతా వ్యూహంలో భారత్ కీలక పాత్ర పోషించబోతోందన్నది స్పష్టమవుతోంది.

Read Also: plane crash : అమెరికాలో టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిన విమానం

#telugu News Ap News in Telugu Bilateral Trade Agreement Breaking News in Telugu Free Trade Agreement India US Global Trade News Google News in Telugu India America Trade Pact India Exports to US India US economic partnership India US Trade Deal Indo US Commerce News Latest News in Telugu Modi Biden Trade Talks Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US India relations US Trade Policy 2025 White House India Trade Announcement White House Statement on India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.