📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

India: ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలో భారత్ ఎటువైపు?

Author Icon By Vanipushpa
Updated: June 23, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణ పశ్చిమాసియానే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది.ప్రపంచ చమురు మార్కెట్లు, వాణిజ్య మార్గాలు, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపైనా దీని ప్రభావం కనిపిస్తోంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ (Operation raising lions)పేరుతో ఇజ్రాయెల్ జూన్ 13న ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. అణ్వస్త్రాలను తయారు చేయాలన్న ఇరాన్(Iran) లక్ష్యాన్ని అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది .ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్, టెల్ అవీవ్‌పై క్షిపణులతో దాడి చేసింది. పశ్చిమాసియాలో ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక, రాజకీయ, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. భారత్‌(India)కు ఈ రెండు దేశాలతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో రక్షణ బంధం.. ఇరాన్‌తో చమురు సరఫరా, బలమైన చారిత్రక సంబంధాలు న్నాయి.ఈ ఘర్షణలో అమెరికా బహిరంగంగానే ఇజ్రాయెల్‌కు మద్దతిస్తోంది. తాజాగా ఇరాన్‌ అణు స్థావరాలను బాంబులు ప్రయోగించి ధ్వంసం చేసినట్లూ ప్రకటించింది .పశ్చిమాసియాలోని ఈ ప్రాంతంలో చైనా, రష్యా కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఈ ఘర్షణను ఆపేందుకు మధ్యవర్తిత్వం చేస్తామని ఈ రెండు దేశాలూ ముందుకొచ్చాయి.అయితే మధ్యవర్తిత్వం కంటే ఈ ప్రాంతంలో అమెరికా అధిపత్యం పెరగకుండా చూడటమే చైనా, రష్యా ప్రధాన ఉద్దేశంగా ఉంది.ఇలాంటి పరిస్థితుల మధ్య అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

India: ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలో భారత్ ఎటువైపు?

ఇజ్రాయెల్ సైనిక చర్యను మరింత తీవ్రం చేస్తుందా?

ఇజ్రాయెల్, ఇరాన్‌తో సంబంధాల్లో భారత్ సమతుల్యత ఎలా సాధిస్తుంది?భారత్ స్పందన భవిష్యత్‌లో ఆయా దేశాలతో సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించనుంది?
బీబీసీ ‘ది లెన్స్’ కార్యక్రమంలో కలెక్టివ్ న్యూస్ రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముఖేశ్ శర్మ ఈ అంశాలపై చర్చించారు.ఈ చర్చలో గ్రేటర్ వెస్ట్ ఆసియా ఫోరం చైర్‌పర్సన్ డాక్టర్ మీనా రాయ్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్ట్రాటజిక్ స్టడీస్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ కబీర్ తనేజా, జెరూసలేం నుంచి సీనియర్ జర్నలిస్ట్ హరీందర్ మిశ్రా పాల్గొన్నారు.
వివాదంలో అమెరికా పాత్ర
ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణలో నేరుగా పాల్గొనాలా వద్దా అనే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయిస్తారని వైట్ హౌస్ కొద్ది రోజుల కిందట చెప్పింది.అలా చెప్పిన తరువాత రెండు రోజుల్లోనే ఇరాన్‌లోని 3 అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది.”అమెరికా విదేశాంగ విధాన లక్ష్యాలలో ఇజ్రాయెల్ భద్రత చాలా ప్రధానమైనది. అందుకే అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొత్తగా ఏమీ అనిపించదు. ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికా పని చేస్తుంది” అని అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్‌లో స్ట్రాటజిక్ స్టడీస్ విభాగ డిప్యూటీ డైరెక్టర్ కబీర్ తనేజా అభిప్రాయపడ్డారు.”ఇరాన్ అణు కార్యక్రమాన్ని మరో పదేళ్ల వరకు పునరద్ధరించలేని విధంగా ధ్వంసం చేయాలనేది ఇజ్రాయెల్ అనుకుంది. అయితే అలాంటి దాడి చేయడానికి అవసరమైన ఆయుధాలు ఇజ్రాయెల్ వద్ద లేవు.
భారత దేశానికి ఆందోళన ఎందుకు?
ఇలాంటి సంఘర్షణలు తలెత్తినప్పుడు ఏదో ఒక దేశం పక్షం వహించడం, ఏమీ మాట్లాడకుండా ఉండటం భారత్ వంటి దేశాలకు అంత తేలిక్కాదు.నెల రోజుల క్రితం భారత్ పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది. ఈ విషయంలో భారత్‌కు ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిచ్చింది.ఇజ్రాయెల్ నుంచి ఇలాంటి నిర్ణయం రావడం సహజం.ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించలేదు.మరోవైపు ఇరాన్, భారత్ మధ్య కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలవి ప్రాచీన నాగరికతలు.చమురు విషయంలో ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన భారత్‌కు ఇరాన్ బలమైన భాగస్వామి.రెండు దేశాల మధ్య చాలాకాలంగా వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలున్నాయి.దీర్ఘకాలంలో తన ప్రయోజనాలకు హాని కలగకుండానే ఎవరి పక్షం వహించాలో నిర్ణయించుకోవడమనేది భారత్ ముందున్న అతి పెద్ద సవాలు.”చమురు దిగుమతులు, గల్ఫ్ దేశాలతో వాణిజ్యంతో పాటు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయుల ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి. యుద్ధం తీవ్రమైతే గల్ఫ్ ప్రాంతాన్ని ఇరాన్ నుంచి వేరు చేసి చూడలేం” అని డాక్టర్ మీనా రాయ్ చెప్పారు.

రష్యా, చైనా ఎవరితో ఉన్నాయి?
ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగానే చైనా వేగంగా స్పందించింది. ఇజ్రాయెల్ ‘రెడ్ లైన్ దాటిందని’ చెప్పింది.ఇజ్రాయెల్ చర్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని బీజింగ్ వ్యాఖ్యానించిందిమరోవైపు రష్యా ఇజ్రాయెల్ దాడులను విమర్శించినప్పటికీ ఇరాన్‌కు మాస్కో ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు.ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.ఈ ఘర్షణలోకి అమెరికా ప్రవేశించడం, ఆ తర్వాత ఇది మరింత తీవ్రమైతే చైనా, రష్యా ఇరాన్‌కు సైనిక సాయం అందిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.”రష్యా, చైనా ఇరాన్‌కు దౌత్యపరమైన మద్దతిస్తాయి.

Read Also: Iran-Israel : ఇరాన్‌కు చాలా దేశాల మద్దతు ఉంది : రష్యా మాజీ అధ్యక్షుడు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in india Iran israel Latest News in Telugu Paper Telugu News stands Telugu News online Telugu News Paper Telugu News Today tensions Where..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.