📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Attack: కశ్మీర్ గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం మాట్లాడారు?

Author Icon By Vanipushpa
Updated: April 23, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో 26మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యటకులే. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద దాడి అని చెబుతున్నారు. దాడి జరిగిన రోజున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్నారు.
అయితే, పహల్గాం దాడికి కొన్నిరోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా కశ్మీర్‌ను పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదని అన్నారు. హిందువులు, ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని వివరించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలకు కొన్ని రోజుల తర్వాత జమ్మూకశ్మీర్‌లో దాడి జరిగింది. ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్తాన్ నుంచి అనేక రకాల స్పందనలు వస్తున్నాయి.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు ఎంపీ షెర్రీ రెహ్మాన్ ట్విట్టర్‌లో ఇలా రాశారు: “పహల్గాంలో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడిని నేను ఖండిస్తున్నాను. దురదృష్టవశాత్తు జరిగిన ఈ దాడికి కూడా పాకిస్తాన్ కారణం అనడం భారత్‌కు సాధారణమై పోయింది” అన్నారు.

హమాస్ దాడితో ముడిపెట్టిన హుస్సేన్ హక్కానీ…
అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ ఎక్స్‌ లో ఇలా రాశారు: “అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద దాడి తర్వాత గాజా విషాదంలో మునిగిపోయింది. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి కూడా పరిణామాల పరంగా అంతే భయంకరమైనది.
Read Also: Amit Shah: ఉగ్రవాదుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Pahalgam Attack Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news What did the Pakistani Army Chief say?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.