📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Suresh Babu: ట్రంప్ నిర్ణయంపై స్పందించిన సురేష్ బాబు ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: May 6, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలకు ప్రపంచమంతా హడలెత్తిపోతోంది. ఇక ట్రంప్ కన్ను సినిమాల మీద పడినట్టుగా కనిపిస్తోంది. ఇతర దేశాల్లో తీసిన చిత్రాలు అమెరికాలో విడుదల చేయాలంటే ఇకపై మూల్యం చెల్లించుకోవాల్సిందే. విదేశీ సినిమాలపై వంద శాతం పన్ను కట్టాల్సిందే అని ట్రంప్ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. దీంతో మన తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ చేస్తే ఇక నష్టాలే తప్పా లాభాలు అనేవి ఉండేవేమో అన్నట్టుగా కనిపిస్తోంది.ట్రంప్ నిర్ణయం మీద సురేష్ బాబు స్పందించాడు. అమెరికాలో ఇన్నేళ్లుగా ఫ్రీ ట్రేడింగ్ చేస్తూ వచ్చాం. అక్కడ ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు కానీ ఇప్పుడు ట్రంప్ మాత్రం కొత్త కొత్త ఆంక్షలన్నీ పెడుతున్నారు. ఆయన తన దేశం గురించి ఆలోచిస్తున్నారు.అక్కడి వారి కోసమే ఆలోచిస్తున్నారు, అందుకే అక్కడ ఎకానమినీ పెంచుకునేందుకు ఇలా ఇతరుల మీద ట్యాక్సులు పెంచేస్తున్నారు.ట్రంప్ నిర్ణయాలతో మన అందరికీ నష్టమే వాటిల్లుతుంది. ఇలా సినిమాల మీద కూడా ఆయన వంద శాతం ట్యాక్స్ విధిస్తాడని ఊహించలేదు అని సురేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఇన్ని రోజులు ఫ్రీగా ఇచ్చారు కదా ఇప్పుడు కూడా ఇవ్వండని అడగలేం కానీ ఇలా సడెన్‌గా చేస్తే అమెరికా ఎకానమీ కూడా దెబ్బ తింటుంది కదా అని అక్కడి వారు కూడా చెబుతున్నారు అసలు ఈ నిర్ణయాల్ని ట్రంప్ ఎప్పుడు అమల్లోకి తీసుకు వస్తాడో చూడాలన్నట్టుగా సురేష్ బాబు చెప్పుకొచ్చాడు.

నిర్మాతలు ఏమంటున్నారంటే

‘ట్రంప్ సుంకాలు అమలుపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ ట్రంప్ బెదిరిస్తున్నట్లు విదేశీ చిత్రాలపై 100 టారిఫ్స్ విధిస్తే, భారతీయ చిత్రాల టికెట్ ధరలు పెరుగుతాయి. దీని వల్ల సినిమా వ్యాపారం దెబ్బతినే అవకాశముందని భయంగా ఉంది’ అని ప్రొడ్యూసర్స్ గిల్డ్​ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాసిశ్​ సర్కార్​, చిత్ర నిర్మాత, డైరెక్టర్​ వివేక్ అగ్నిహోత్రి, ఎగ్జిబిటర్​-డిస్ట్రిబ్యూటర్​ అక్షయ్ రాఠి అంటున్నారు.విదేశాల్లో ఉన్న భారతీయులు ఎక్కువగా మన సినిమాలు చూస్తారు. కనుక అక్కడ భారతీయ సినిమాలకు మంచి ఆదాయం వస్తుంది. జవాన్, బాహుబలి లాంటి సినిమాలు అమెరికా మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించాయి. అమెరికాలో సినిమా టికెట్ల ధరలు పెరిగితే, ఎవరూ థియేటర్​కు వచ్చి సినిమా చూస్తారని నేను అనుకోను. నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ లాంటి వాటిల్లో ఈ సినిమాలు అందుబాటులో ఉంటే, ఇక థియేటర్​కు ఎవరు వస్తారు? అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రవాస భారతీయులు లేని చోట్ల కూడా ది కశ్మీర్ ఫైల్స్, ఆర్​ఆర్​ఆర్ సినిమాలు బాగా ఆడాయి.

ప్రభావం

భారతీయ సినిమాలకు యూకే, మిడిల్ ఈస్ట్​, సింగపూర్, ఆస్ట్రేలియా సహా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. కనుక అమెరికాలో భారతీయ సినిమాలు విడుదల కాకపోతే, పెద్దగా మనపై ప్రభావం పడదు. ట్రంప్ చాలా సిల్లీగా ప్రవర్తిస్తున్నారు. ఆయన హాలివుడ్ చిత్రపరిశ్రమను చంపుతున్న విషయాన్ని గ్రహించడం లేదు. ఇక్కడ గ్రహించాల్సిన మరొక విషయం ఏమిటంటే, యూఎస్​లో షూటింగ్ చాలా ఖరీదైనది. కనుక చాలా మంది అక్కడ మూవీస్ షూట్ చేయరు. హిందీ సినిమాలను ఎక్కువగా యూకేలో చిత్రీకరిస్తారు. ఎందుకంటే అక్కడ వారికి సబ్సిడీ ఇస్తారు. కనుక ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ మనపై పడకపోవచ్చు.

Read Also: India- Pak War : భారత్ – పాక్ ఉద్రికత్తలు మధ్య ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన

#FreeTrade #SureshBabu #TradeRestrictions #TrumpDecision #USPolicies Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.