Rohit Sharma: రోహిత్ శర్మ పేలవ ఫామ్ పై మాజీ క్రికెటర్ ఏమన్నాడంటే.!

Read Time:  1 min
Rohit Sharma: రోహిత్ శర్మ పేలవ ఫామ్ పై మాజీ క్రికెటర్ ఏమన్నాడంటే.!
FONT SIZE
GET APP

ఐపీఎల్ 2025 సీజన్‌లో గురువారం సొంత వేదికపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)నూ చిత్తు చేసింది ముంబై ఇండియన్స్.వాంఖడేలో జరిగిన పోరులో హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.షమీ రెండో ఓవర్లోనే ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 26, 3 సిక్సర్లు) తనదైన ట్రేడ్‌మార్క్‌ సిక్సర్లతో అలరించాడు. కమిన్స్‌ ఓవర్‌లోనూ స్కేర్‌ లెగ్‌ మీదుగా సిక్స్‌ కొట్టిన హిట్‌మ్యాన్‌ అదే ఓవర్లో ఐదో బంతికి హెడ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మరో ఓపెనర్‌ రికెల్టన్‌ (31) ఇషాన్‌ మలింగ బౌలింగ్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదాడు. హర్షల్‌ 8వ ఓవర్లోనూ బ్యాక్‌టుబ్యాక్‌ బౌండరీలు కొట్టిన అతడు ఐదో బంతికి ఔట్‌ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్యతో జతకలిసిన జాక్స్‌ ముంబై ఛేదనను వేగవంతం చేశాడు. ఈ ఇద్దరూ ఓవర్‌కు 10 పరుగులకు తగ్గకుండా ఆడటంతో లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. మూడో వికెట్‌కు 29 బంతుల్లోనే 52 రన్స్‌ జోడించిన వీరిని కమిన్స్‌ విడదీశాడు. సూర్యతో పాటు జాక్స్‌ కూడా కమిన్స్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరినా ముంబై పెద్దగా ఇబ్బందిపడలేదు. ఆఖర్లో కెప్టెన్‌ హార్దిక్‌(21), నమన్‌ ధీర్‌(0) వెంటవెంటనే ఔటైనా సాంట్నర్‌(0)తో కలిసి తిలక్‌వర్మ(21 నాటౌట్‌) జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కమిన్స్‌(3/26), మలింగ(2/36) ఆకట్టుకున్నారు.ఈ నేపథ్యం లో మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ పై కీలక వ్యాఖ్యలు చేసాడు.

వరుస మ్యాచ్‌

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్ శర్మ చేసిన పరుగులే మరే ఆటగాడు చేసినా అతనికి మళ్లీ అవకాశం దక్కేది కాదు. ఇదే టోర్నీలో మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లు ఇంతకంటే మెరుగైన ప్రదర్శన చేసినా తుది జట్టులో చోటు కోల్పోయారు. కేవలం రోహిత్ శర్మ పేరుతోనే హిట్ మ్యాన్‌ వరుస మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అతని సామర్థ్యంపై ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ నమ్మకంతో ఉంది. ఏదో ఒక మ్యాచ్‌లో ఆడకపోతాడా? అనే ఆశతో ఉన్నారు.ముంబై ఇండియన్స్ తమ జైత్రయాత్రను కొనసాగించాలి. అలా కాకుండా ముంబై ఇండియన్స్ విజయాలు సాధించకపోతే రోహిత్ శర్మ పరుగులు చేయకపోతే జట్టుకు సమస్యగా మారుతుంది. రోహిత్ శర్మ ఎంతో ప్రతిభావంతమైన ఆటగాడు. భారత జట్టుకు అతను ఏం చేశాడో మాకు బాగా తెలుసు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కంటే మెరుగ్గా ఆడిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ కెప్టెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతన్ని మించిన ఆటగాడు లేడు. అతని సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లు గెలిచింది.’అని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు.

  Rohit Sharma: రోహిత్ శర్మ పేలవ ఫామ్ పై  మాజీ క్రికెటర్ ఏమన్నాడంటే.!

హిట్ మ్యాన్

రోహిత్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఆడిన ఐదు మ్యాచుల్లో 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడు తన బ్యాటను ఝళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి తర్వాత ఆడబోయే మ్యాచుల్లోనైనా హిట్ మ్యాన్ రాణిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ట్రావిస్ హెడ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో 214 పరుగులు చేశాడు. అందులో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 67 పరుగులు.

Read Also: IPL 2025: ముంబయి జట్టు అరుదైన రికార్డు నమోదు

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.