అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ల(Trump, JD Vance, Elon Musk)ను చంపేస్తామంటూ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ వీడియోను కూడా విడుదల చేశారు. మొత్తంగా 30 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో అల్‌ఖైదా అరేబియన్ పెనున్సులా విభాగం నాయకుడు సౌద్‌బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను, శ్వేతసౌధం సిబ్బందిని హతమారుస్తామని తెలిపారు. అందులో చాలా మంది పెద్ద పెద్ద నేతలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
సౌద్‌బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ తలపై అమెరికా ఇప్పటికే 6 మిలియన్ డాలర్ల రివార్డ్
అల్‌ఖైదా అరేబియన్ పెనున్సులా విభాగం నాయకుడు సౌద్‌బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ తలపై అమెరికా ఇప్పటికే 6 మిలియన్ డాలర్ల రివాడ్రు ప్రకటించింది. గతేడాది మార్చిలో ఆయన ఈ సంస్థకు అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా ఆయన 30 నిమిషాల నిడివి గల ఓ వీడియోను విడుదల చేశారు. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఆయన మంత్రి వర్గంలోని కీలక నేతలను చంపబోతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఆయన విడుదల చేసిన ఈ వీడియోలో.. తాము ఎవరెవరిని చంపాలని భావిస్తున్నారో కచ్చితంగా చెప్పేశారు. గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవాలని ముందుగా సౌద్‌బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ పిలుపునిచ్చారు.
మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సె కూడా వున్నారు
ఆపై అమెరికాలోని లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని తేల్చి చెప్పారు. చంపాల్సిన వారి లిస్టులో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సె, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సహా శ్వేతసౌధంతో సంబంధాలు ఉన్న ప్రతీ ఒక్క అధికారి, నాయకుడిని, వారి కుటుంబాలను, బంధువులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని పేర్కొన్నారు. గాజాలో పాలస్తీనా వాసులకు వీరు ఎలాంటి ఆధారాలు మిగల్చలేదని.. అందుకే ఈ స్థాయిలో దాడులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత… అత్యంత ప్రమాదకర గ్రూపుగా ఈ అల్‌ఖైదా అరేబియన్ పెనున్సులా అవతరించింది. ప్రస్తుతం యెమెన్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ నాయకుడు అల్-అవ్లాకీ ఇప్పటికే అనేక సార్లు అమెరికాపై దాడికి పిలుపునిచ్చాడు. అత్యంత చురుగ్గా పని చేస్తున్న ఈ సంస్థ.. గతంలో అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో ప్రమాదకర దాడులు చేసింది. 2009లో అండర్ వేర్ బాంబర్ కుట్ర, 2015లో చార్లె బెబ్డోపై దాడి చేసింది ఈ సంస్థనే. ఆ తర్వాత అమెరికా దీన్ని ఉగ్రజాబితాలో చేర్చింది.
గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా..
గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ట్రంప్ సహా అతడి మంత్రులను, వైట్ హౌస్ సిబ్బందిని అంతమొందిస్తామని చెప్పాడు. ఈ ప్రతీకారం ప్రపంచంలోని ముస్లింలందరిదని అన్నాడు. ఏ దేశానికి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా సరే మహమ్మద్ ను ప్రవక్తగా నమ్మే వారందరికీ ప్రతీకారం తీర్చుకోవాలంటూ పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా ఒక్క అమెరికాలోనే 4.5 మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారని సాద్ బిన్ గుర్తుచేశాడు. అల్‌ఖైదాలో అరేబియా పెనెన్సులా విభాగమే ప్రస్తుతం అత్యంత చురుగ్గా పనిచేస్తోంది. యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఉగ్రసంస్థ గతంలో ప్రమాదకర దాడులు నిర్వహించింది. బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూపుగా అవతరించింది. 2024 మార్చిలో అరేబియన్ పెనున్సులా అధిపతిగా సాద్ బిన్ బాధ్యతలు చేపట్టాడు. సాద్ బిన్ తలపై అమెరికా ఇప్పటికే 6 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
Read Also: Shukla Axiom-4: శుభాన్షు శుక్లా అంతరిక్షయాత్ర మళ్లీ వాయిదా