పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడినవారిని భారత్ వదిలిపెట్టే ప్రసక్తేలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మొదటిసారి పహల్గామ్ ఉగ్రదాడిపై మాట్లాడారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తప్పించుకోలేరని, వారికి కష్టాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ‘‘పహల్గామ్‌లో దారుణమైన ఉగ్రదాడికి పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదని ప్రతి ఒక్కరినీ వేటాడి పట్టుకుంటాం. 26 మందిని చంపడం ద్వారా గెలిచామని అనుకోవద్దు మిమ్మల్ని అందరినీ బాధ్యులను చేస్తాం’ అని హోం మంత్రి అన్నారు. పహల్గామ్ దాడి వెనుక పాకిస్థాన్ కుట్రలపై అనుమానం వ్యక్తం చేస్తోన్న భారత్ దాయాదికి బుద్దిచెప్పడానికి సిద్ధమైన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.అసోంకి చెందిన బోడో నేత ఉపేంద్ర నాథ్ బ్రహ్మ విగ్రహ ఆవిష్కరణలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం; ఎవరినీ విడిచిపెట్టదు. ఈ దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనేది మా సంకల్పం, అది నెరవేరుతుంది’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినవారికి హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ, అసోం సీఎంలు రేఖా గుప్తా, హిమాంత బిశ్వశర్మ, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రమోద్ బోరో తదితరులు నివాళులర్పించారు.
శిబిరం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన భద్రత వ్యవహారాల క్యాబినెట్ (సిసిఎస్ ) సమావేశంలో ఉగ్రవాదులకు సరిహద్దుల నుంచి ఉన్న సంబంధాల గురించి చర్చించారు. గతంలో పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతిస్పందనగా భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరంపై మెరుపుదాడులు చేసింది. ఈ సమయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని సహించదని, ఉగ్రవాదులు ఎంతటి దుశ్చర్యలకు పాల్పడినా వారిని వదిలిపెట్టేది లేదు అని హోం మంత్రి తేల్చి చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరచిపోమని ఆయన అన్నారు.
ప్రతీకార
ఈ దాడి వెనుక ఉన్న పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ అనేక చర్యలు చేపట్టింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం సహా ఆ దేశ పౌరులను ఇండియా నుంచి తిరిగి పంపించి వేస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 780 మంది పాకిస్థాన్ వెళ్లిపోయారు. మరోవైపు దాయాది దేశం సైతం ప్రతీకార చర్యలు చేపట్టి భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతోంది.
Read Also: India – Pakistan War : పాకిస్థాన్లో హైఅలర్ట్