📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Wayne Larkins: ఇంగ్లీష్ లెజెండరీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ ఇకలేరు

Author Icon By Anusha
Updated: June 29, 2025 • 10:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్, లెజెండరీ ఓపెనర్ వేన్ లార్కిన్స్ (Wayne Larkins) ఇకలేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ వార్త క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. కుటుంబసభ్యులు, మాజీ సహచరులు, అభిమానులు ఆయన మృతిపై సంతాపం ప్రకటించారు.క్రీడా ప్రపంచంలో వేన్ లార్కిన్స్ నెడ్‌గా ప్రసిద్ధి చెందాడు. వేన్ లార్కిన్స్ 1953 నవంబర్ 22న యూకేలోని రాక్‌స్టన్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌ (United Kingdom) లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన వేన్ లార్కిన్స్ 1979 నుంచి 1991 మధ్య కాలంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరఫున 13 టెస్టులు, 25 వన్డేలు ఆడాడు. టెస్టులలో 3 హాఫ్ సెంచరీలు, వన్డేలలో ఒక సెంచరీ చేశాడు.

వేన్ లార్కిన్స్ పరుగులు ఎన్ని చేశాడంటే?

వేన్ లార్కిన్స్ ఇంగ్లాండ్‌కు మాత్రమే కాకుండా దేశీయ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్, డర్హామ్, బెడ్‌ఫోర్డ్‌షైర్ జట్లకు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా కీలక పాత్ర పోషించాడు. దేశీయ క్రికెట్‌లో వేన్ లార్కిన్స్ మొత్తం 482 ఫస్ట్ క్లాస్, 485 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. అదే సమయంలో వేన్ లార్కిన్స్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 842 ఇన్నింగ్స్‌లలో వేన్ లార్కిన్స్ 34.44 సగటుతో 27, 142 పరుగులు పూర్తి చేశాడు. లిస్ట్ ఏలో 467 ఇన్నింగ్స్‌ (Innings) లలో 30.75 సగటుతో 13,594 పరుగులు సాధించాడు.కాగా వేన్ లార్కిన్స్ ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 85 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు బాదాడు. వేన్ లార్కిన్స్ బ్యాటింగ్‌లో ఫస్ట్ క్లాస్‌లో 59 సెంచరీలు, 116 హాఫ్ సెంచరీ చేయగా.. లిస్ట్ ఏ క్రికెట్‌లో 26 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 40,736 పరుగులు సాధించారు. అటు బౌలింగ్‌లోనూ 119 వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.

Wayne Larkins:

పలు విజయాలు సాధించగలిగిన ఆటగాడు

వేన్ లార్కిన్స్ ఆటతీరు, జాడలో ఎటూ తడబడని ధైర్యమైన బ్యాటింగ్ ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి.క్రికెట్‌ అభిమానుల గుండెల్లో ఆయన ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతారు. క్రికెట్‌లో పెద్దగా హైప్ లేకుండానే తన స్టైల్‌తో పలు విజయాలు సాధించగలిగిన ఆటగాడు లార్కిన్స్. వేన్ లార్కిన్స్ మృతి ఇంగ్లీష్ క్రికెట్‌ (Cricket) కు తీరని లోటు. బలమైన ఆటగాడు, మంచి మానవతావాది అయిన లార్కిన్స్ జీవితం, క్రీడా లోకం పట్ల ఆయన ఆసక్తి ఎన్నటికీ మరవలేనివి.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఓ ఘన నివాళి.

Read Also: Prasidh Krishna: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా నా వల్లే ఓడిపోయింది: ప్రసిధ్

#CricketLegend #EnglandCricket #RIPWayneLarkins #WayneLarkins Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.