📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Putin: అణ్వాయుధాలు వాడకుండానే ఉక్రెయిన్​తో యుద్ధం: పుతిన్

Author Icon By Vanipushpa
Updated: May 19, 2025 • 1:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అణ్వాయుధాలు ఉపయోగించకుండానే ఉక్రెయిన్​(Ukraine)తో యుద్ధాన్ని పూర్తి చేసి, అనుకున్న లక్ష్యాలను సాధించే సత్తా రష్యా(Russia)కు ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) అన్నారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పుతిన్ (Putin)ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఉక్రెయిన్​పై రష్యా డ్రోన్ల దాడికి దిగింది.
హక్కులకు రక్షణ కల్పించడమే రష్యా ఉద్దేశం
అణ్వాయుధాలను వినియోగించే తప్పును బలవంతంగా మాతో చేయించాలని చాలా ప్రయత్నాలు జరిగాయని పుతిన్ పేర్కొన్నారు. కానీ, వాటిని వాడకుండానే మా లక్ష్యాలను సాధించే శక్తి తమకు ఉందని చెప్పారు. యుద్ధానికి కారణమైన అంశాలకు పూర్తిగా ముగింపు పలకడం, శాశ్వత శాంతి కోసం పరిస్థితులను సృష్టించడం, దేశ భద్రతకు హామీ వంటివి తమ లక్ష్యాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్​లో రష్యన్ మాట్లాడే ప్రజల దీర్ఘకాలిక శాంతి, వారి హక్కులకు రక్షణ కల్పించడమే రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అన్నారు.

Putin: అణ్వాయుధాలు వాడకుండానే ఉక్రెయిన్​తో యుద్ధం: పుతిన్

273 డ్రోన్లతో ఉక్రెయిన్​పై దాడి
అంతకుముందు ఉక్రెయిన్‌పై వందలాది డ్రోన్లతో రష్యా మరోసారి విరుచుకుపడింది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలయ్యాక సంఖ్యాపరంగా మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని ఉక్రెయిన్‌ వర్గాల సమాచారం. యుద్ధం ముగింపు విషయంలో ఇస్తాంబుల్‌ వేదికగా ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ముఖాముఖి శాంతి చర్చలు జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ భారీ దాడులు జరగడం గమనార్హం. కీవ్‌ సహా ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా రష్యా 273 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 88 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ వైమానికదళం తెలిపింది.
Read Also: Hinduja Group: యూకే కుబేరుల జాబితాలో హిందుజా గ్రూప్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News putin Telugu News online Telugu News Paper Telugu News Today War with Ukraine without using nuclear weapons

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.