📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

US Visa: క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు: ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: May 27, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) సంచలన నిర్ణయాలు తీసుకుంటు న్నారు. ముఖ్యంగా అమెరికా(America)లో ఉంటున్న విదేశీ విద్యార్థులు, అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు కారణాలతో విదేశీ విద్యార్థుల వీసాలను (US Visa) రద్దు చేస్తూ.. వారిని దేశం నుంచి బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్‌(India) సహా యూఎస్‌(US)లో ఉంటున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ సర్కార్‌ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

US Visa: క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు: ట్రంప్

ప్రకటన విడుదల చేసిన రాయబార కార్యాలయం
చదువుకోవడానికి అని అమెరికాకు వెళ్లి విద్యా సంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొట్టినా వీసాలు రద్దు చేస్తామని (Skip classes lose your visa) హెచ్చరించింది. ఈ మేరకు ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy in India) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘డ్రాపౌట్‌ అయినా, క్లాస్‌లకు గైర్హాజరైనా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్‌ నుంచి వెళ్లిపోయినా.. మీ విద్యార్థి వీసా రద్దవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా మీరు అర్హతను కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించండి. మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి’ అని యూఎస్‌ ఎంబసీ ఆ ప్రకటనలో వెల్లడించింది.
ట్రంప్‌ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి తిప్పి పంపుతున్నారు అమెరికా అధికారులు. ముందస్తు నోటీసు లేకుండా వీసాలను రద్దు చేస్తూ అంతర్జాతీయ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం తన అణచివేతను తీవ్రతరం చేసింది. పాలస్తీనా అనుకూల నిరసనల నుంచి ట్రాఫిక్‌ ఉల్లంఘనల వరకూ.. ఇలా ఏదో ఒక కారణంతో విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూ వారిని దేశం నుంచి బహిష్కరిస్తోంది.
వెయ్యి మందికిపైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసా రద్దు
అమెరికాలో విద్యనభ్యసిస్తున్న 1,000 మందికిపైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. సోసియేటెడ్‌ ప్రెస్‌ కథనం ప్రకారం మార్చి నుంచి హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ వంటి ప్రముఖ విద్యాసంస్థలతోపాటు దేశంలోని 160 కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన వెయ్యి మందికిపైగా విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా అధికారులు రద్దు చేశారు. ఇలా వీసా రద్దైన వారిలో చాలామంది భారతీయులు ఉన్నారు. వీసాల రద్దు లేదా స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్ ‌(సెవీస్‌) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఏ) వెల్లడించింది.

Read Also: French: పార్లమెంటులో ఫ్రాన్స్ మంత్రి ముక్కులో వేలు.. వీడియో వైరల్..

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu if students skip classes Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today trump Visas will be revoked

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.