📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Visakhapatnam: ఈ నెల 13 నుంచి విశాఖపట్నం నుంచి అబుదాబికి విమాన సర్వీసులు

Author Icon By Anusha
Updated: June 11, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరం మరో కీలక అంతర్జాతీయ కనెక్టివిటీ సాధించింది. విశాఖపట్నం నుంచి అబుదాబికి నేరుగా విమాన సేవలు ప్రారంభించనున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధులు తెలిపారు. జూన్ 13 (శుక్రవారం) నుంచి ఈ విమాన సర్వీసు అధికారికంగా ప్రారంభంకానుంది.అలాగే విశాఖపట్నం-భువనేశ్వర్‌ మధ్య విమాన సర్వీసులు జూన్‌ 15 నుంచి ప్రారంభంకానుంది.

విమాన సర్వీసు

ఈ విమానం మధ్యాహ్నం 1.55కి విశాఖపట్నం చేరుకొని తిరిగి 2.25కి భువనేశ్వరకు వెళ్తుంది అన్నారు.ఇటు జూన్‌ 2 నుంచి విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు(Air India Express Service)లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.మరోవైపు ఇండిగో విమానయాన సంస్థ జులై 2 నుంచి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసును ప్రారంభించనుంది.

మంచి స్పందన

మరోవైపు ఇండిగో విమానయాన సంస్థ జులై 2 నుంచి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సర్వీసును ప్రారంభించనుంది. దక్షిణ భారత సేల్స్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ సచ్‌దేవా ఈ విషయాన్ని తెలిపారు.విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్‌లకు కూడా విమాన సర్వీసులు నడపాలని ఏపీ ఛాంబర్స్‌(AP Chambers) కోరింది. గతంలో సింగపూర్‌కు ఇండిగో విమానాలు నడిపినప్పుడు మంచి స్పందన వచ్చిందని ఛాంబర్స్‌ గుర్తు చేసింది. ఈ మేరకు సౌరభ్‌ సచ్‌దేవా బృందం ఏపీ ఛాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్‌రావుతో సమావేశమైంది. గతంలో ఇండిగో సింగపూర్‌కు విమానాలు నడిపినప్పుడు 80 శాతం సీట్లు నిండాయని గుర్తు చేశారు. దుబాయ్, సింగపూర్‌లకు విమాన సర్వీసులు చాలా అవసరమన్నారు.

Visakhapatnam

సాంస్కృతిక

పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,ఆంధ్రా నుంచి త్వరలో ప్రారంభంకానున్న ఈ సర్వీసుల ద్వారా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య సంబంధాలు బలోపేతమవుతాయన్నారు.ఈ కొత్త విమాన సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని ప్రాంతాన్ని భారతదేశంలో ప్రధాన టెక్‌ హబ్‌(Tech Hub)లలో ఒకటైన బెంగళూరుకు అనుసంధానం కావొచ్చు అన్నారు. ఇటు విశాఖ-భువనేశ్వర్‌ సర్వీసుతో రెండు తూర్పు తీర నగరాల మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి దోహదపడుతుంది అన్నారు.

ఆర్థికాభివృద్ధికి దోహదం

ఈ విమాన మార్గం కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్ని వ్యాపార, టూరిజం, ఐటీ రంగాల్లో అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ విమాన మార్గం అనుకూలంగా నిలుస్తుంది. దీంతో విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, విదేశీ పర్యాటకుల రాక కూడా మరింతగా పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.

Read Also: TTD: టీటీడీ ఉద్యోగుల సమస్యలపై శ్యామల రావు కీలక ఆదేశాలు

#AbuDhabi #IndiGoAirlines #InternationalFlights #Visakhapatnam #VizagToAbuDhabi Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.