📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

China: చైనాలోకి వీసా లేకుండా 10 రోజులు ఎంట్రీ

Author Icon By Vanipushpa
Updated: June 12, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అంతర్జాతీయ పర్యాటకం, వ్యాపార సంబంధాలను ప్రోత్సహించే లక్ష్యంతో చైనా(China) కీలకమైన నిర్ణయం తీసుకుంది. 55 దేశాల పౌరులకు తమ 240 గంటల (10 రోజుల) వీసా రహిత ట్రాన్సిట్ విధానాన్ని విస్తరించినట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే 240 గంటల పాటు పాస్‌పోర్ట్(Passport) ఉంటే వీసా లేకపోయినా ఆ దేశంలో ఉండవచ్చు. ఈ నూతన మార్పులు నేటి నుంచి అంటే జూన్ 12వ తేదీ గురువారం రోజు నుంచే అమల్లోకి రాబోతున్నట్లు వివరించింది. బీజింగ్ ప్రకటించిన ఈ కొత్త పాలసీతో చైనాలో ఆయా దేశాల ప్రజలు స్వల్పకాలిక పర్యటనలను సౌకర్యవంతంగా చేసుకోవచ్చు.

China: చైనాలోకి వీసా లేకుండా 10 రోజులు ఎంట్రీ

55 దేశాల జాబితాలో ఉన్నవారికి మాత్రమే
చైనా తీసుకు వచ్చిన ఈ 240 గంటల వీసా రహిత ప్రయాణ వెసులుబాటు వల్ల ప్రయాణికులు చైనాలో పర్యాటక కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. లేదంటే వ్యాపార సంబంధిత పనులను కూడా నిర్వహించుకోవచ్చు. ఇండోనేషియా, రష్యా, బ్రిటన్ వంటి కీలక దేశాలు ఈ 55 దేశాల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 144 గంటల వీసా రహిత ట్రాన్సిట్ విధానం అమలులో ఉండేది. కానీ చైనా ఇప్పుడు దాన్ని 240 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అర్హత కల్గిన దేశాల సంఖ్యను కూడా గణనీయంగా పెంచేసింది. ఈ విషయాన్ని షిన్హువా న్యూస్ ఏజెన్సీయే నేరుగా వెల్లడించింది. ఈ దేశాల పౌరులు చైనాలో ప్రత్యేక వీసా లేకుండానే తాత్కాలికంగా ప్రవేశించవచ్చు.
తప్పనిసరి పత్రాలు:
ఈ పథకం చైనాకు వచ్చేవారి వద్ద ధ్రువీకరించిన తేదీలతో ఇతర దేశాలకు వెళ్లే ఇంటర్ లైన్ టికెట్లు, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే వీరు దేశంలోని 24 ప్రావిన్సుల్లోని 40 ఓపెన్ పోర్టుల ద్వారా చైనాలో ప్రవేశించవచ్చు. ముఖ్యంగా బీజింగ్, షాంఘై వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. అలాగే పర్యాటక స్థలాల సందర్శన, ఫ్యామిలీ విజిట్స్ వంటివి కూడా చేయొచ్చు. కానీ విద్య, పని, న్యూస్ రిపోర్టింగ్ వంటివి చేయాలంటే మాత్రం సరైన వీసాతో పాటు అధికారుల అనుమతి తప్పనిసరి.
చైనా లక్ష్యం:
చైనా వివిధ దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను అబివృద్ధి చేసుకోవడానికి, అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొవిడ్-19 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం దెబ్బతిన్న నేపథ్యంలో చైనా ఈ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చి పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ చర్యతో చైనాలో విదేశీ పెట్టుబడులు, వ్యాపార సమావేశాలు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: Indian Companies: భారత కంపెనీల ప్రతినిధులు చైనాకు పయనం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu into China for 10 days Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Visa-free entry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.