📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Venkata Charan: విశాఖ వాసి వెంకట చరణ్‌కు అమెరికా అరుదైన గౌరవం

Author Icon By Anusha
Updated: June 29, 2025 • 7:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం యువ ఇంజినీర్‌ వెంకట చరణ్‌ తన పరిశోధన ప్రతిభతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తయారీ రంగంలో అత్యంత కీలకమైన అంశమైన ఫ్రిక్షన్ వెల్డింగ్పై చేసిన లోతైన పరిశోధనలు ఆయనకు అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక EB-1 గ్రీన్‌కార్డును అందజేసింది. సాధారణంగా ఈ గుర్తింపు నోబెల్ బహుమతి గ్రహీతలు, ఆస్కార్ అవార్డు విజేతలు, ఒలింపిక్స్ పతక విజేతల వంటి అసాధారణ ప్రతిభ గల వ్యక్తులకు మాత్రమే లభిస్తుంది. అలాంటి గౌరవాన్ని ఒక తెలుగు యువ ఇంజినీర్ వెంకట చరణ్ (Venkata Charan)పొందడం గర్వకారణంగా మారింది.ఈబీ-1 గ్రీన్‌కార్డ్ అనేది ఏదైనా ఒక రంగంలో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన విదేశీయులకు అమెరికా ఇచ్చే శాశ్వత నివాస హోదా. దీనికి దరఖాస్తు చేసుకున్న వందలాది మంది నిపుణులతో వెంకట చరణ్ పోటీ పడ్డారు. అనేక దశల వడపోత అనంతరం, ఆయన పరిశోధనల ప్రాముఖ్యత, అంతర్జాతీయంగా ఆయనకున్న పేరును పరిగణనలోకి తీసుకుని అమెరికా ప్రభుత్వం ఆయన్ని ఈ గ్రీన్‌కార్డు (Green Card) కు ఎంపిక చేసింది.

ఈబీ-1 గ్రీన్‌కార్డు రావడానికి దోహదపడింది

వెంకట చరణ్ రాసిన పరిశోధన పత్రాలను 25 దేశాలకు చెందిన పరిశోధకులు సుమారు 400 సార్లు తమ అధ్యయనాల్లో ప్రస్తావించడమే ఆయన ప్రతిభకు నిదర్శనం.విమానాల తయారీ, భారీ వంతెనల నిర్మాణం, గ్యాస్ పైప్‌లైన్ల ఏర్పాటు వంటి అత్యంత కీలకమైన పనుల్లో వెల్డింగ్ నాణ్యత చాలా ముఖ్యం. వెల్డింగ్ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫ్రిక్షన్ వెల్డింగ్‌ (Friction welding) పై చరణ్ చేసిన పరిశోధనలు సరికొత్త మార్గాన్ని చూపాయి. ఇది కూడా ఆయనకు ఈబీ-1 గ్రీన్‌కార్డు రావడానికి దోహదపడింది.వెంకట చరణ్ విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో బీఈ పూర్తి చేశారు. 15 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి, అక్కడ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ హోదాలో పనిచేస్తున్నారు.

Venkata Charan:

ఐదు పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలను సైతం రచించారు

అంతర్జాతీయంగా 20కి పైగా జర్నల్స్‌లో ఆయన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఐదు పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలను సైతం రచించారు. అమెరికా సొసైటీ ఫర్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ), సొసైటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్స్ (ఎస్‌ఎంఈ) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సభ్యుడిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం ఎస్‌ఎంఈ (SME) నుంచి ఉత్తమ యువ ఇంజినీర్ అవార్డును కూడా అందుకున్నారు.అంతర్జాతీయంగా 20కి పైగా జర్నల్స్‌లో ఆయన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఐదు పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలను సైతం రచించారు. అమెరికా సొసైటీ ఫర్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ), సొసైటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్స్ (ఎస్‌ఎంఈ) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సభ్యుడిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం ఎస్‌ఎంఈ నుంచి ఉత్తమ యువ ఇంజినీర్ అవార్డును కూడా అందుకున్నారు.

Read Also: Kakinada: 48 గంటల్లోనే బాలిక మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు

#EB1GreenCard #FrictionWeldingResearch #IndianInnovation #VenkataCharan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.