📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

US: రష్యాతో వ్యాపారం మానేయండి.. భారత్‌కు అమెరికా ఆంక్షలు

Author Icon By Vanipushpa
Updated: July 2, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పుడు ప్రపంచంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. అమెరికా(America) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం చూపేలా ఉన్నాయి. ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) దాడి నేపథ్యంలో, రష్యాను ఆర్థికంగా బలహీనపరచాలన్న ఉద్దేశంతో అమెరికా గట్టిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో భారత్(India) లేదా చైనా(China) లాంటి దేశాలు రష్యాతో బిజినెస్ చేస్తుంటే, అక్కడి నుంచి వచ్చే సరుకులపై 500% దిగుమతి ట్యాక్స్ వేయాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇది అమలైతే, గ్లోబల్ ట్రేడ్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల ఒక కీలకమైన బిల్లు ప్రతిపాదించింది. ఈ బిల్లు ప్రకారం, రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై ప్రత్యేకంగా భారత్, చైనా నుంచి వచ్చే ఉత్పత్తుల పై 500% దిగుమతి ట్యాక్స్ వేయాలని ఆలోచిస్తుంది.

US :రష్యాతో వ్యాపారం మానేయండి.. భారత్‌కు అమెరికా ఆంక్షలు

అసల ఎందుకు ఈ బిల్లు(Sanctioning Russia Act) పెడతుందంటే రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత కూడా, భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్నాయి. రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు, అలాగే ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉండని దేశాలను ఒత్తిడి చేయడమే లక్ష్యం. భారత్, చైనా ప్రధానంగా ఈ బిల్లులో లక్ష్యంగా ఉన్న దేశాలు. ఈ రెండు దేశాలు కలిపి రష్యా చమురు ఎగుమతుల్లో దాదాపు 70% కొనుగోలు చేస్తున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి చర్చలు
అమెరికా సెనేట్ సభ్యుడు లిండ్సే గ్రాహామ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో, ఈ బిల్లును ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్షుడికి టారిఫ్ అమలుపై మినహాయింపు (waiver) ఇచ్చే అధికారం కూడా ఈ బిల్లులో ఇవ్వబడింది. ఈ చర్యల ప్రధాన లక్ష్యం రష్యా యొక్క యుద్ధ సామర్థ్యాన్ని ఆర్థికంగా బలహీనపరచడం, మరియు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి చర్చలు జరిగేలా ఒత్తిడి తీసుకురావడం. ఈ బిల్లు ప్రస్తుతం ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో 84 మంది సభ్యులు దీనికి మద్దతు తెలిపారు. వచ్చే ఆగస్టు నెలలో ఈ బిల్లును అధికారికంగా ప్రవేశపెట్టే అవకాశముంది.
ఏ ఉత్పత్తులపై ప్రభావం?
ఈ బిల్లు అమలైతే, భారత్, చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఔషధాలు, వస్త్రాలు, ఆటోమొబైల్ భాగాలు, ఐటీ సేవలు వంటి అనేక ఉత్పత్తులపై 500% దిగుమతి టాక్స్ విధించ బడే అవకాశం ఉంది.
రష్యా చమురుపై చైనా, భారత్ లు ఆధారపడుతున్నాయి
భారత దేశం ప్రస్తుతం అమెరికాతో వ్యాపార ఒప్పందాల (ట్రేడ్ డీల్) చర్చల్లో ఉంది. అయితే “Sanctioning Russia Act” బిల్లు అమలయ్యే పరిస్థితి వస్తే, ఆ ఒప్పందం ద్వారా అందాల్సిన ప్రయోజనాలు తగ్గిపోవచ్చు, లేదా కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, చైనా మరియు భారత్ రష్యా చమురుపై భారీగా ఆధారపడుతున్నాయి. ఈ రెండు దేశాలు కలిపి రష్యా చమురు ఎగుమతుల్లో దాదాపు 70% వరకు కొనుగోలు చేస్తున్నాయి. ఒక్క భారత్‌నే తీసుకుంటే, 2024లో రోజుకు సగటున 1.96 మిలియన్ బ్యారెల్స్ చమురు రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. ఇది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్‌ల నుంచి కలిపి దిగుమతులు కంటే అధికం.

Read Also: Delhi CM : ఢిల్లీ సీఎం నివాసానికి రూ.60 లక్షలతో పునరుద్ధరణ పనులు

#telugu News 500 percent tariff threat Ap News in Telugu Biden India Russia Breaking News in Telugu Google News in Telugu India export sanctions India Russia oil trade India US trade relations Latest News in Telugu Lindsey Graham Russia bill Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump India warning US India Russia trade US sanctions on India US Senate India bill

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.