📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump Removes Mike: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్​ వాల్జ్​పై వేటు

Author Icon By Vanipushpa
Updated: May 2, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌పై వేటు పడింది. ఆ పదవి నుంచి ఆయనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కనపెట్టారు. వాల్జ్‌ స్థానంలో తాత్కాలికి భద్రతా సలహాదారుగా విదేశాంగశాఖ మంత్రి రుబియోను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇక వాల్జ్​ను ఐక్యరాజ్య సమితి రాయబారిగా నియమించారు. కాగా, ఇది డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారులో మొదటి కీలక మార్పుగా నిలిచింది. .
సురక్షితంగా వుండడకోసం పోరాడుదాం:ట్రంప్
“ఐక్యరాజ్యసమితికి తదుపరి అమెరికా రాయబారిగా మైక్ వాల్ట్జ్‌ను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడం నాకు సంతోషంగ ఉంది. యుద్ధభూమిలో యూనిఫాంలో ఉన్నప్పటి నుంచి, కాంగ్రెస్‌లో, నా హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా, మైక్ వాల్ట్జ్ మన దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విదేశాంగ శాఖలో తన బలమైన నాయకత్వాన్ని కొనసాగిస్తూనే జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తారు. అమెరికాతో పాటు ప్రపంచాన్ని మళ్లీ సురక్షితంగా మార్చడానికి మనం కలిసి అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటాం” — అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ట్రంప్ నామినేషన్​పై మైక్ వాల్జ్ స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ గొప్ప దేశానికి నా సేవను కొనసాగిస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉందని చెప్పారు.

తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష డెమొక్రట్లు
డొనాల్డ్ ట్రంప్‌ మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించక ముందే సిగ్నల్‌లోని గ్రూప్‌చాట్‌ ద్వారా తనకు తెలిసిందని ‘ది అట్లాంటిక్‌ మ్యాగజైన్’ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ తెలిపారు. తనను రెండు రోజుల ముందే గ్రూప్‌లో చేర్చుకున్నారని వెల్లడించారు. ఆ ‘సిగ్నల్‌’ గ్రూప్‌ను తానే క్రియేట్‌ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు మైక్‌ వాల్జ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. గ్రూప్‌ను తానే క్రియేట్‌ చేసినప్పటికీ- ఆ జర్నలిస్టు ఫోన్‌ నంబర్‌ తన వద్ద లేదన్నారు.

Read Also: Richest Actors: ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన నటులు ఎవరో తెలుసా?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Mike Walz fired Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US National Security Advisor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.