📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Los Angeles: ఆందోళనకారులపై యూఎస్‌ మెరైన్స్​ మోహరింపు

Author Icon By Vanipushpa
Updated: June 10, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇమ్మిగ్రేషన్‌ దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో అమెరికా(America)లోని లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles) రగిలిపోతోంది. శుక్రవారం లాస్‌ ఏంజెలెస్‌(Los Angeles)లో ఫెడరల్‌ అధికారులు జరిపిన దాడులతో నగరమంతా అట్టుడికిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగోరోజైన సోమవారం కూడా లాస్‌ ఏంజెలెస్‌లో ఆందోళనలు కొనసాగాయి. వలసల పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా వేలాదిగా జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు నేషనల్‌ గార్డ్స్‌కు సాయంగా పెంటగాన్‌ దాదాపు 700 మంది మెరైన్స్‌ను (US Marines) మోహరించింది.

Los Angeles: ఆందోళనకారులపై యూఎస్‌ మెరైన్స్​ మోహరింపు

రంగంలోకి నేషనల్‌ గార్డ్స్‌ దళాలు
నిరసనకారులను అడ్డుకునేందుకు నేషనల్‌ గార్డ్స్‌ దళాలకు (US National Guard) చెందిన 2 వేల మందిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయిన నేపథ్యంలో మరో 2 వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ దళాలను అదనంగా మోహరించాలని ట్రంప్‌ ఆదేశించారు. ఈ అదనపు దళాలను అక్కడకు తరలించడానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టవచ్చని ఓ అధికారి తెలిపారు. దీంతో వారం మధ్య నాటికి నేషనల్ గార్డ్ సభ్యుల సంఖ్య 4,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.
ట్రంప్‌ చర్యను ఖండించిన కాలిఫోర్నియా గవర్నర్‌
అయితే డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని కాలిఫోర్నియా (California) గవర్నర్ గవిన్ న్యూసన్​ తీవ్రంగా ఖండించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు అదనంగా 2000 మంది నేషనల్ గార్డ్స్‌ను మోహరించడం ‘మా దళాలను అగౌరపరచడమే అవుతుంది’ అని ఎక్స్​ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. నేషనల్ గార్డ్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా నేషనల్ గార్డ్స్‌ను మోహరించడం తమ రాష్ట్ర సార్వభౌమత్వాన్ని కాలరాయడమే అవుతుందని అక్షేపించారు. దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తామని తెలిపారు. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తానని ప్రకటించారు.
రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించకుండా నేషనల్‌ గార్డును ఆ రాష్ట్రంలో మోహరించడం చట్ట విరుద్ధం, అనైతికమని డెమోక్రాట్‌ పార్టీకి చెందిన గవిన్‌ విమర్శించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా అక్కడ నేషనల్‌ గార్డ్స్‌ను నేరుగా మోహరించడం గత కొన్ని దశాబ్దాల్లో ఇదే ప్రథమం కావడం గమనార్హం. ట్రంప్ తీసుకున్న ఇలాంటి దుందుడుకు చర్యలవల్లే ఆందోళనలు మరింత పెరుగుతున్నాయని న్యూసమ్‌తోపాటు, లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌ విమర్శించారు.

Read Also: SpaceX Dragon : స్పేస్ ఎక్స్ డ్రాగన్ ప్రయోగం వాయిదా

#telugu News Ap News in Telugu Breaking News in Telugu deployed against protesters Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US Marines

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.