📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Houthi: హూతీలపై అమెరికా భారీ క్షిపణులతో దాడులు

Author Icon By Vanipushpa
Updated: April 28, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యెమెన్​లోని హూతీ ఉగ్రవాదులపై ఆదివారం రాత్రి చేసిన క్షిపణి దాడిలో సుమారు 30 మంది మరణించారు. హూతీల ఏరివేత లక్ష్యంగా మార్చి 15 నుంచి అమెరికా వారిపై యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో నెలన్నరలో ఇప్పటివరకు హూతీలపై సుమారు 800 క్షిపణులతో దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్​ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. తమ దూకుడు వల్ల అంతర్జాతీయ నౌకలపై హూతీల దాడులు తగ్గినట్లు తెలిపింది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు 69శాతం, డ్రోన్​ దాడులు 55శాతం తగ్గినట్లు వివరించింది.

మరిన్ని క్షిపణి దాడులు చేస్తాం
హూతీలపై దాడుల తీవ్రతను మరింత పెంచుతాం. వారు నౌకలపై దాడులను నిలిపివేసి ప్రశాంత వాతవారణం వచ్చేవరకు దాడులు చేస్తాం. ఆపరేషన్​ రఫ్​రైడర్​ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 800 క్షిపణి దాడులు చేశాం. దీంతో వందలాది హూతీ ఉగ్రవాదులతో పాటు నేతలు, అధికారులు మరణించారు. ఇంకా అనేక కార్యాలయాలతో పాటు గగనతల రక్షణ వ్యవస్థ, అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తి, భద్రత వ్యవస్థలను ధ్వంసం చేశాం అని అమెరికా సెంట్రల్ కమాండ్​ వెల్లడించింది.
దాడులు కొనసాగిస్తాం
హూతీల ఉగ్రవాద కార్యకలపాలకు ఆదాయం అందించే రాస్ ఇసా చమురు పోర్ట్​ పైన దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ వైమానిక దాడుల్లో 74 మంది మృతి చెందగా, మరో 171 మందికి గాయాలయ్యాయి. హూతీలకు ఇంధనాన్ని అందించే స్థావరాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే దాడులు చేపట్టామని తెలిపింది. దీని ఆధారంగానే హూతీలు మిలియన్​ డాలర్ల ఆదాయం ఆర్జిస్తున్నట్లు వివరించింది.
ఇప్పటికీ హూతీలకు ఇరాన్​ సాయం చేస్తూనే ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్​ మద్దతు వల్లే తమ దళాలతో హూతీలు పోరాడగలుతున్నారని అభిప్రాయంపడింది. తమ లక్ష్యమైన స్వేచ్ఛాయుత నౌకాయనం జరిగేవరకు దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అటు హూతీలకు మద్దతు ఇవ్వొద్దని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హెచ్చరికలు జారీ చేశారు. హూతీల చర్యలకు ఇరానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వివరించారు. కాగా, ఎర్ర సముద్రంలో వాణిజ్య, యుద్ధ నౌకలపై దాడులు ఆపాలనే లక్ష్యంతో యెమెన్‌లోని హౌతీలపై మార్చి 15న అమెరికా సైనిక చర్యను మొదలుపెట్టింది.

Read Also: India Pakistan: కష్టాల అంచున పాకిస్థాన్..కేజీ చికెన్ రూ.800

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu massive missile strikes on Houthis Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US launches

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.