US-Iran : మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఇరాన్ వైఖరికి నిరసనగా అమెరికా తన సైనిక బలగాలతో ఇరాన్ భూభాగంపై అత్యంత భీకరమైన దాడులకు శ్రీకారం చుట్టింది. నిన్న అర్ధరాత్రి నుంచి అమెరికా సైన్యం అత్యాధునిక గైడెడ్ మిస్సైళ్లు (షిపణులు), క్లస్టర్ బాంబులతో ఇరాన్ రక్షణ, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఇరాన్ దేశానికి గుండెకాయ లాంటి ‘బందర్ అబ్బాస్’ (Bandar Abbas) రేవు పట్టణం, ఖెర్మ్ ఐలాండ్ మరియు మర్కాజీ ప్రావిన్స్‌లలోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల ధాటికి ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తున పేలుళ్లు సంభవించి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాకుండా, వ్యూహాత్మకంగా హార్ముజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ టెలీకమ్యూనికేషన్ టవర్లను అమెరికా క్షిపణులతో పేల్చివేయడంతో ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
Read Also : 15 ఏళ్ల కుర్రాడిపై వేటు.. సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇవ్వడంపై గవాస్కర్ ఫైర్!

అమెరికాకు ఇరాన్ గట్టి కౌంటర్.. కువైట్ సైనిక స్థావరాలపై ప్రతిదాడులు!
అమెరికా జరుపుతున్న వైమానిక, క్షిపణి దాడులపై ఇరాన్ సైన్యం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. తాము అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ప్రతీకార దాడులకు దిగింది. కువైట్‌లో మోహరించి ఉన్న అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ‘హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్’ (HIMARS) మిస్సైల్ లాంచర్స్ మరియు వాటి భారీ స్టోరేజీ (ఆయుధశాల) వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తాము ఎదురుదాడి చేసినట్లు ఇరాన్ సైనిక కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సాగుతున్న ఈ ప్రతీకార దాడుల వల్ల ప్రపంచ చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి (UN) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరినప్పటికీ, యుద్ధ జ్వాలలు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :