📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

US-India: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం

Author Icon By Vanipushpa
Updated: July 3, 2025 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం- అమెరికా(India-US) మధ్య ఒక ముఖ్యమైన మిని ట్రేడ్ డీల్(Trade Deal) రాబోయే 48 గంటల్లో ఖరారు కానుంది. రెండు దేశాల మధ్య చర్చలు వాషింగ్టన్‌(washington)లో శరవేగంగా జరుగుతున్నాయి. అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ముగింపుకు సంబంధించి అనేక దశల్లో చర్చలు జరిగాయి. జూలై 9 కి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం మొదటి దశగా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ముగించాలని ఆసక్తిగా ఉంది. ఈ విషయంలో, భారత అధికారులు అమెరికాతో చర్చలు జరపగా..అమెరికా అధికారులు భారతదేశాన్ని సందర్శించి పలుమార్లు చర్చలు జరిపారు.
భారత్- అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం
48 గంటల్లో కీలక ఒప్పందం: ఈ నేపథ్యంలోనే భారత్- అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై రాబోయే 48 గంటల్లో సంతకం చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత వారం అమెరికాను సందర్శించిన భారత అధికారుల బృందం తమ పర్యటనను పొడిగించింది. మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసే పని ముమ్మరం చేసింది. చర్చల్లో కొన్ని తీవ్రమైన అంశాలపై ఇప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం లేదు

US-India: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం

రైతుల భద్రత, ఆహార భద్రతకు ప్రమాదకరం: భారత్
అమెరికన్ ఉత్పత్తులు భారతదేశ వ్యవసాయం, పాడి రంగంలో ఎక్కువ శాతం ఉండాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే GM పంటలు రైతుల భద్రత, ఆహార భద్రతకు ప్రమాదకరమని భారత్ భావిస్తోంది. దీంతో ఈ రెండు డిమాండ్లను వ్యతిరేకిస్తోంది. అమెరికన్ నుండి దిగుమతి అయ్యే పాడి పరిశ్రమ ఉత్పత్తులు గ్రామీణ జీవనోపాధిని, స్థానిక మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని భారత్ ఈ డిమాండును వ్యతిరేకిస్తోంది.

భారత్ డిమాండ్: దుస్తులు, పాదరక్షలు, తోలు వంటి రంగాలపై US సుంకాలను తగ్గించడం లేదా మినహాయించడం అమెరికా చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ రంగాలు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న తరహా వ్యాపారులకు ఉపాధిని అందించడంతొ పాటుగా ఎగుమతుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఈ నేపథ్యంలోనే మా డిమాండ్లను అంగీకరించడకుండా మీ డిమాండ్లపై సంతకం చేయమని మోదీ సర్కారు స్పష్టం చేసింది. ఇది భారతదేశ ఎగుమతి రంగానికి ప్రయోజనం కలిగించదని వాదిస్తోంది.

భారతదేశ ఎగుమతులకు తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం
ఇది భారతదేశ ఎగుమతులకు తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వస్త్ర, తోలు, వ్యవసాయ రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఒప్పందం కుదిరితే, భారతదేశానికి అమెరికా మార్కెట్‌లో మరింత ప్రాప్యత లభిస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం పెరుగుతాయి, పెట్టుబడులు కూడా వృద్ధి చెందుతాయి. 2026 నాటికి ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకి తీసుకెళ్లే దారిని సులభతరం చేస్తుంది. ఇది కేవలం కాగితపు ఒప్పందం మాత్రమే కాదు, అనేక రంగాల దిశను మార్చే ముఖ్యమైన అడుగు. రాబోయే 48 గంటలు కీలకంగా ఉంటాయి.

Read Also: India-US Mini Trade Deal: ఇండియా – అమెరికా మినీ ట్రేడ్ డీల్!

#telugu News Ap News in Telugu bilateral trade agreement india us Breaking News in Telugu Google News in Telugu india us business cooperation india us economic relations india us investment deal india us partnership india us strategic trade initiative india us trade growth Latest News in Telugu Modi Biden Trade Talks Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news trade ties between india and america us india trade deal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.