📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Los Angeles: అమెరికా అక్రమ వలసదారుల ఏరివేతలతో తీవ్ర ఉద్రిక్తలు

Author Icon By Vanipushpa
Updated: June 9, 2025 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

v వలసదారుల ఏరివేతలో భాగంగా ఫెడరల్‌ అధికారులు చేపట్టిన దాడులతో లాస్‌ ఏంజెలెస్‌ (Los Angeles) అట్టుడుకుతోంది. శుక్రవారం లాస్‌ ఏంజెలెస్‌(Los Angeles)లో ఫెడరల్‌ అధికారులు జరిపిన దాడులతో నగరమంతా అట్టుడికిన సంగతి తెలిసిందే. ఫెడరల్‌(Fedaral) అధికారులకు స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నది. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు, పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారు. దీంతో పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో నేషనల్‌ గార్డ్స్‌ దళాలకు (US National Guard) చెందిన 2 వేల మందిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) రంగంలోకి దింపారు.

వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న నిరసనకారులు
ట్రంప్‌ చర్యకు వ్యతిరేకంగా ఆదివారం లాస్‌ ఏంజెలెస్‌లో వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నిరసనకారులను కట్టడి చేసేందుకు అధికారులు టియర్‌ గ్యాస్‌, రబ్బరు బుల్లెట్లు, ఫ్లాష్‌ బ్యాంగ్‌లను ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిరసన కారులు మరింత రెచ్చిపోయారు. ట్రంప్‌ ప్రభుత్వం, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు (Cars On Fire). నిరసన కారుల చర్యతో నడిరోడ్లపై అనే కార్లు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం లాస్‌ ఏంజెలెస్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిరసనకారులను అధికారులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు.


వారం రోజుల్లో 118 మందిని అరెస్టు
లాస్‌ ఏంజెలెస్‌లోని పారమౌంట్‌ సిటీలో వలసదారులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో 118 మందిని అరెస్టు చేశారు. శుక్రవారం 44 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
ఒక వైపు అక్రమ వలసదారుల ఏరివేతపై లాస్‌ ఏంజెలెస్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తగ్గేదేలే అన్న తరహాలో వ్యహరిస్తున్నారు. అక్రమ వలసదారులను విడిచిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. 2 వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించాలని అధికా రులను ఆదేశించారు. ఈ అరాచకానికి కారణం పెయిడ్‌ ట్రబుల్‌ మేకర్స్‌ అని ఆరోపించారు.

Read Also: Tap Water : ట్యాప్ వాటర్ తాగిన మహిళ మృతి : ఎందుకంటే?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu on illegal immigrants Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Tensions rise over US crackdown Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.