📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Japan: ట్విట్టర్ కిల్లర్‌కు మరణశిక్ష అమలు

Author Icon By Vanipushpa
Updated: June 27, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జ‌పాన్‌(Japan)లో 9 మందిని చంపిన 34 ఏళ్ల వ్య‌క్తికి ఇవాళ మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేశారు. 2017లో ఆ నిందితుడు 8 మంది అమ్మాయిల‌ను హ‌త్య చేశాడు. అత‌నికి 2022లో మ‌ర‌ణ‌శిక్షను ఖ‌రారు చేశారు. నిందితుడు ట‌కాహిరో(Takahero) షిరాయిసి.. ట్విట్ట‌ర్(Twitter killer) అకౌంట్ ద్వారా వ్య‌క్తుల‌ను ప‌రిచ‌యం చేసుకుని, వాళ్ల‌ను మ‌ర్డ‌ర్ చేశాడు. సూసైడ్(Suicide) చేసుకోవాల‌నే ఆలోచ‌న‌ల్లో ఉన్న యువ‌త‌ను టార్గెట్ చేసి.. వాళ్ల‌ను త‌న ఇంటికి ర‌ప్పించి హ‌త‌మార్చిన‌ట్లు ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ అయ్యింది.

Japan: ట్విట్టర్ కిల్లర్‌కు మరణశిక్ష అమలు

15 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న మ‌హిళ‌ల‌నే టార్గెట్
15 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న మ‌హిళ‌ల‌నే అత‌ను టార్గెట్ చేశాడు. 2017 అక్టోబ‌ర్‌లో అత‌ని ఆగ‌డాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఓ అదృశ్య వ్య‌క్తి కేసులో విచార‌ణ చేప‌డుతున్న స‌మ‌యంలో జ‌మా సిటీ(Jama City)లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి శ‌రీర భాగాలు దొరికాయి. దాని ఆధారంగా నిందితుడు ట‌కాహిరోను ప‌ట్టుకున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌ల్లో ఉన్న వ్యక్తుల‌ను మ‌ర్డ‌ర్ చేసిన‌ట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ప్ర‌స్తుతం ఎక్స్‌గా పేరుమార్చుకున్న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ ద్వారా అత‌ను బాధితుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఆన్‌లైన్‌లో సూసైడ్ గురించి డిస్క‌స్ చేశాడు. చ‌నిపోవాల‌నుకుంటున్న వారికి స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పి ఆ త‌ర్వాత వాళ్ల‌కు ఇంటికి ర‌ప్పించి మ‌ర్డ‌ర్ చేసిన‌ట్లు తేలింది.
ముక్క‌లైన శ‌రీర భాగాలు
పోలీసులు నిందితుడి ఫ్లాట్‌కు వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఇంట్లో ఉన్న కూల‌ర్లు, టూల్ బాక్సుల్లో ముక్క‌లైన శ‌రీర భాగాల‌ను గుర్తించారు. ప్రాసిక్యూట‌ర్లు అత‌నికి డెత్ పెనాల్టీ ఇవ్వాల‌ని వాదించారు. అయితే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి బాధితులు ఇష్ట‌ప‌డ్డార‌ని, అందుకే నిందితుడికి త‌క్కువ శిక్ష వేయాల‌ని కోర్టులో అత‌ని త‌ర‌పున లాయ‌ర్లు వాదించారు. అత‌ని మాన‌సిక స్థితిని అంచ‌నా వేయాల‌ని భావించారు. బాధితుల్ని తానే చంపిన‌ట్లు చివ‌ర‌కు అత‌ను అంగీక‌రించాడు. టకాహిరో షిరాయిషి నేరగానే కాక, సోషల్ మీడియా వ్యామోహాన్ని వినియోగించుకుని చిత్తశుద్ధితో ఉండే బాధితులను ఉద్దేశపూర్వకంగా వేటాడిన క్రూరరూపం. ఈ కేసు జపాన్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మానవ సంబంధాల సాంఘిక ప్రమాదంపై హెచ్చరికగా నిలిచింది.

Read Also: Bangalore Accident: సరదాగా పార్టీలో ఫ్రెండ్స్ తో గడుపుతూ పై నుంచి జారిపడ్డ యువతి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu crime against women Google News in Telugu Japan capital punishment Japan execution news Japan hanging execution Japan justice system Japan news Latest News in Telugu mental health and crime Paper Telugu News serial killer Japan social media crime Takahiro Shiraishi Takahiro Shiraishi case Takahiro Shiraishi death penalty Telugu News online Telugu News Paper Telugu News Today Twitter killer Twitter killer execution Twitter killer Japan Twitter murder case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.