📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Pakistan: కరాచీ తీరానికి తుర్కియే గస్తీ నౌక.. రష్యాను సాయం కోరిన పాక్

Author Icon By Vanipushpa
Updated: May 5, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దాయాది దేశం భయాందోళన చెందుతోంది. అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా పాక్‌ తన మిత్రదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమచారం. అందుకు మరింత బలం చేకూర్చేలా తుర్కియేకు చెందిన భారీ యుద్ధనౌక కరాచీ తీరం చేరింది. మరోవైపు తమకు సాయం చేయాలని రష్యా ప్రభుత్వాన్ని పాక్​ రాయబారి కోారారు.
తుర్కియేను సంప్రదించి గస్తీ నౌకను
తుర్కియేకు చెందిన ‘టీజీసీ బుయుకడా’ అనే భారీ యుద్ధ నౌక ఆదివారం కరాచీ తీరాన్ని చేరింది. 2013లో జలప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేయగలదు. గస్తీ కాయడంలో అందవేసిన చేయి. పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు చెందిన నౌకలకు జలమార్గాలను భారత్‌ నిషేధించింది. మరోవైపు ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుండం వల్ల భారత్‌ ఏ క్షణమైనా దాడి చేయొచ్చని పాకిస్థాన్‌ కలవరం చెందుతోంది.

రష్యా సాయం కోరిన పాక్
భారత్​తో పెరుగుతున్న సంక్షోభాన్ని తగ్గించుకోవడానికి సాయం చేయాలని పుతిన్ ప్రభుత్వాన్ని రష్యాలోని పాక్ రాయబారి మహ్మద్ ఖలీద్ జమాలీ కోరారు. రష్యాకు భారత్‌తో విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, పాకిస్తాన్‌తో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1966లో తాష్కెంట్‌ వేదికగా భారత్ పాక్ మధ్య జరిగిన ఒప్పందంలో అప్పటి సోవియట్ ప్రధాని మధ్యవర్తిత్వం వహించినట్టు రష్యా ఇప్పుడు అలా చేయాలని కోరారు. మరోవైపు శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, పహల్గామ్ దాడి తర్వాత ఇరు పక్షాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరారు.

Read Also: Houthi Missile Attack: బెన్‌ గురియన్‌ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు మిస్సైల్‌ దాడి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Karachi coast Latest News in Telugu Pakistan asks Russia for help Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Turkish patrol ship

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.