Telugu News: Turkey: నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్

Read Time:  1 min
Turkey
Turkey
FONT SIZE
GET APP

ఇశ్రాయేల్-హమాస్ లమధ్య యుద్ధం సమసిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చొరవతో రెండుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో కాల్పుల విరమణ, బందీల విడుదల కార్యక్రమాలు వేగంగా జరిగిపోయాయి. అయినా కూడా ఇజ్రాయెల్ మళ్లీ మళ్లీ హమాస్, గాజాలపై దాడులకు తెగబడుతున్నది. దీంతో హమాస్ కు చెందిన పలువురు మరణిస్తున్నారు. సామాన్య ప్రజలూ మృతి చెందుతున్నారు.

Read Also: RSS: నేడు రేపు బెంగళూరు లో మోహన్ భగవత్ ప్రసంగం

Turkey
Turkey

నెతన్యాహు కారణం అంటూ ముస్లిం దేశాలు

 దీనికంతటికీ ఇజ్రాయెల్(Israel) ప్రధానమంత్రి నెతన్యాహు కారణం అంటూ ముస్లిం దేశాలుమండిపడుతున్నాయి. ఇందులో భాగంగా నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్ జారీ చేసింది. ఆయనతోపాటు మంత్రులు కట్జ్, ఇతమాన్ బెన్ గ్విర్, ఇతర అధికారులతో మొత్తం 37మందిని వాంరెంటులో చేర్చినట్లు ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ పేర్కొంది.

ఖండించిన ఇజ్రాయెల్ ఈ వార్త క్షణాల్లో ఇతర దేశాలకు ప్రాకిపోయింది. నిజమేనంటూ నమ్ముతున్నాయి. నెతన్యాహు అరెస్టు ఇక తప్పదు అని అనుకుంటున్నారు. అయితే ఇజ్రాయెల్ దేశం దీన్ని ఖండించింది. తుర్కియే నిరంకుశ పాలకుడు ఎర్డోగన్ ప్రజలను మభ్యపెట్టే స్టంట్ ఇది అని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.