📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Turkey: ముంచుకొచ్చిన కార్చిచ్చు మంటలు

Author Icon By Vanipushpa
Updated: July 2, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం యూరప్ దేశాల్లో వేసవి ప్రారంభం. దీంతో ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్‌(France,Italy,Germany, Portugal, Netherlands) దేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేశారు. స్పెయిన్‌(Spain)లో జూన్ నెలలో అత్యంత వేడిగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. విపరీతమైన వడగాలులు కారణంగా టర్కీ(Turkey)లో కార్చిచ్చు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. టర్కీలో కార్చిచ్చులు చెలరేగడంతో 50,000 మందికి పైగా ఖాళీ చేయబడ్డారు. యూరప్ ఖండం(Europe continent)లోని దేశాలకు ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో టర్కీ, ఫ్రాన్స్‌లలో సోమవారం కార్చిచ్చు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
బలమైన గాలుల కారణంగా ప్రమాదం
అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేశారు. 50,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ ఐరోపాలోని చాలా ప్రాంతాలు జూన్‌లో కాకుండా జూలై లేదా ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే 5 నుంచి-10 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Turkey: ముంచుకొచ్చిన కార్చిచ్చు మంటలు

ఫ్రాన్స్‌లో 40°C దాటిన ఉష్ణోగ్రతలు – 400 హెక్టార్లు దగ్ధం

టర్కీలోని పశ్చిమ ప్రావిన్స్ ఇజ్మీర్‌లో రెండవ రోజు కూడా కార్చిచ్చులు చెలరేగాయని, బలమైన గాలుల కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అటవీ మంత్రి ఇబ్రహీం యుమక్లి తెలిపారు. జూన్ 30, జూలై 1 న ఫ్రాన్స్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ 29న నైరుతి ఆడ్ విభాగంలో మంటలు చెలరేగి, 400 హెక్టార్లు అరణ్య భూమి దగ్ధమైంది. ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి, ప్రజలను ముందస్తుగా ఖాళీ చేయించారు. కార్చిచ్చు ప్రమాదాన్ని అదుపు చేసేందుకు భారీగా హెలికాప్టర్లు, అగ్నిమాపక వాహనాలు మోహరించబడ్డాయి.

నిపుణుల హెచ్చరిక – భవిష్యత్తులో మరింత ప్రమాదం

ఇజ్మీర్‌లో 42,000 మందికి పైగా సహా ఐదు ప్రాంతాల నుండి 50,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు టర్కీ AFAD అత్యవసర నిర్వహణ అథారిటీ తెలిపింది. జూన్ 30, జూలై 1న ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. ఆదివారం(జూన్ 29)న నైరుతి ఆడ్ విభాగంలో కార్చిచ్చు చెలరేగింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ (104 డిగ్రీల ఫారెన్‌హీట్)ను అధిగమించాయి. దీంతో 400 హెక్టార్లు దగ్ధమయ్యాయి. అధికారులు ప్రజల్ని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ మార్పులు, హీట్‌వేవ్‌లు, వడగాలులు కలిసి టర్కీ మరియు పశ్చిమ ఐరోపాలో ప్రమాదకర పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.

Read Also: Modi 5 Nation Tour : నేటి నుంచి ప్రధాని 5 దేశాల టూర్ స్టార్ట్

#telugu News AFAD evacuation Turkey Ap News in Telugu Breaking News in Telugu Europe heatwave alert extreme temperatures Europe 2025 forest fire news Europe France forest fires global warming wildfire impact Google News in Telugu heatwave in Europe heatwave orange alert France Izmir fire evacuation Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Turkey wildfire 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.