📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Trump: ఇరాన్ హెచ్చరిక తో ట్రంప్ అనూహ్య నిర్ణయం!

Author Icon By Vanipushpa
Updated: June 12, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకునేందుకు ఆ దేశంతో అమెరికా(America) జరిపిన చర్చలు విఫలం కావడం పశ్చిమాసియాలో మరోసారి నిప్పుల కుంపటి రాజేసేలా కనిపిస్తోంది. ఇరాన్(Iran) తో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో అర్ధాంతరంగా వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్(Donald) ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పైకి వేరే కారణం చెబుతున్నా పశ్చిమాసియా నుంచి బలగాల్ని వెనక్కి పిలిపిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది.

Trump: ఇరాన్ హెచ్చరిక తో ట్రంప్ అనూహ్య నిర్ణయం!

దీటుగా స్పందించిన ఇరాన్
అమెరికాతో జరిగిన అణుచర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ దీటుగా స్పందిస్తోంది. అణ్వస్త్ర కార్యక్రమాలు నిలిపేస్తే గతంలో విధించిన ఆంక్షలు ఎత్తేస్తామన్న హామీతో అమెరికాతో చర్చలు జరిపిన ఇరాన్ మరిన్ని హామీలు కోరింది. దీంతో అమెరికా వాటిని అంగీకరించకుండా చర్చల్ని ఆపేసి వెనక్కి తగ్గింది. దీంతో ఇరాన్ ఆగ్రహంగా ఉంది. చర్చలు విఫలమైన వేళ అమెరికా తమ బలగాలతో దాడులు చేస్తుందన్న భయాల్ని తోసిపుచ్చిన ఇరాన్.. తమతో పెట్టుకుంటే ప్రత్యర్థికి తమ కంటే ఎక్కువ నష్టం చేసి తీరుతామని హెచ్చరించింది. ఈ పరిణామాలన్నీ పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతకు దారితీయబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్-అమెరికా సంబంధాల్లో మరింత ఉద్రిక్తతలు, భద్రతా పరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఆత్మరక్షణలో ట్రంప్
ఈ హెచ్చరికలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఆత్మరక్షణలో పడేశాయి. ఇప్పటికే పశ్చిమాసియా దేశాల్లో వివిధ కారణాలతో మోహరించిన తమ బలగాల్ని అక్కడే కొనసాగిస్తే ఇరాన్ దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న భయంతో వాటిని వెనక్కి పిలిపిస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా బలగాలు దాడులకు దిగితే వారి స్థావరాలు తమకు అందుబాటులోనే ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలన్న ఇరాన్ హెచ్చరిక ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమ దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భద్రత అవసరం
దీనిపై స్వయంగా ట్రంప్ ను మీడియా ప్రశ్నిస్తే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవని, వాటిని సంపాదించుకునే అవకాశం ఆ దేశానికి ఇవ్వబోమని తేల్చేశారు. అటువంటప్పుడు పశ్చిమాసియా నుంచి బలగాల ఉపసంహరణ ఎందుకని ప్రశ్నిస్తే అమెరికా పౌరులకు తమ దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భద్రత కల్పించాల్సిన బాధ్యత తమకు ఉందని చెప్పుకొచ్చారు. ఇరాన్ దాడులు చేస్తే తమ స్థావరాలే లక్ష్యమవుతాయని భావించిన ట్రంప్, తమ బలగాలను బహ్రెయిన్, కువైట్ లాంటి దేశాల నుండి వెనక్కి పిలిపిస్తున్నారు. డియా ప్రశ్నలకు స్పందించిన ట్రంప్, ఇరాన్‌కు అణ్వాయుధాలు సంపాదించేందుకు అవకాశం ఇవ్వబోమని స్పష్టంగా తెలిపారు.

Read Also: Trump Vs Musk : మస్క్ క్షమాపణలు స్వాగతించిన ట్రంప్ – కరోలిన్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Trump's unexpected decision with Iran warning!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.