📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Elon Musk: ఆ ఫైల్స్​లో ట్రంప్ పేరు కూడా ఉంది..ఎలాన్ మస్క్ ఆరోపణలు

Author Icon By Vanipushpa
Updated: June 6, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలల లైంగిక వేధింపుల కేసులో జెఫ్రీ ఎప్టిటీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సంపన్నులకు యువతులను, బాలికలను అక్రమంగా రవాణా చేసేవాడని ఎప్సిటీన్​పై ఆరోపణలు ఉన్నాయి. దీనితో అతని సన్నిహితులు, క్లయింట్లకు సంబంధించిన డేటాను ‘ఎప్సిటీన్ ఫైల్స్'(Apsiteen File)అంటున్నారు. ఈ ఫైల్స్​లో ట్రంప్(Trump) పేరు కూడా ఉందని తాజాగా ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన ఆరోపణలు చేశారు.
నా మద్దతు లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు: మస్క్​
మస్క్, డొనాల్డ్ ట్రంప్​ల మధ్య వైరం మరింత పెరుగుతోంది. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని ఎలాన్‌ మస్క్‌ అన్నారు. ‘నేను లేకుంటే డొనాల్డ్​ ట్రంప్‌ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్‌లో రిపబ్లికన్లు 51-49 మంది మాత్రమే ఉండేవారు’ అని మస్క్ పేర్కొన్నారు.

Elon Musk: ఆ ఫైల్స్​లో ట్రంప్ పేరు కూడా ఉంది..ఎలాన్ మస్క్ ఆరోపణలు

ఇరువురి మధ్య విభేదాలు
ఇంతకు ముందు ట్రంప్, మస్క్​పై పలు వ్యాఖ్యానాలు చేశారు. రిపబ్లికన్‌ ట్యాక్స్‌ బిల్లును ఎలాన్​ మస్క్‌ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్‌ అన్నారు. అంతేకాదు, తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్‌ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్‌ లేకున్నా పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. అక్కడితో ఆగకుండా, ఎలాన్​ మస్క్‌ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. దీనితో మస్క్​ తనదైన రీతిలో ఎక్స్ వేదికగా చెలరేగిపోయారు.

కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా?’

‘కొత్త పార్టీ పెట్టవచ్చా?’ అని అభిమానులను ప్రశ్నించారు. ’80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా?’ అని అడిగారు. వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్​, డొనాల్డ్ ట్రంప్​నకు మద్దతు ప్రచారం చేశారు. వీరిద్దరి మధ్య సంబంధాలు ఇటీవలి వరకు బాగానే ఉన్నాయి. కానీ రిపబ్లికన్‌ ట్యాక్స్‌ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి.

Read Also: Metropol Newspaper : మహిళల అనుమతి లేకుండా పొట్టి దుస్తుల ఫోటోల ప్రచురణ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Elon Musk's allegations Google News in Telugu is also in those files Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump's name

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.