📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Trump Tariffs: ఫార్మా రంగంపై ట్రంప్ భారీగా పన్నుల మోత?

Author Icon By Vanipushpa
Updated: April 9, 2025 • 1:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా ఫస్ట్ నినాదంతో దూకుడుగా ముందుకెళ్తున్న అధ్యక్షుడు ట్రంప్ ఈ క్రమంలో ఏ దేశాన్నీ వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై ఇప్పటికే ట్రంప్ నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతుండగా.. ఇప్పుడు తాజాగా ఆయన మరో ప్రకటన చేసారు. దీంతో భారత్ ఎగుమతులపై ఆధారపడిన ఆ కీలక రంగం తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అప్పుడే మన దేశంలో తయారీ, ఎగుమతిదారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
భారత్ సహా పలు దేశాలకు షాక్
ఇప్పటివరకూ ప్రతీకార పన్నులతో వివిధ దేశాలను టార్గెట్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మరో కొత్త రంగంపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన కూడా చేసారు. ఫార్మా రంగంపై ఈసారి భారీగా పన్నుల మోత ఉంటుందని ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు భారత్ సహా పలు దేశాలకు షాకిచ్చింది. ముఖ్యంగా అమెరికాకు ఫార్మా ఎగుమతుల్లో టాప్ లో ఉన్న భారత్ పై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపబోతోంది.

భారీగా సుంకాలు విధించబోతున్నారు
తాజాగా నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఫార్మా రంగంపై త్వరలో భారీగా సుంకాలు పెంచబోతున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు తరలించడానికి ప్రోత్సహిస్తుందని కూడా వెల్లడించారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఔషధాలు, సెమీకండక్టర్లను దాని ప్రతీకార సుంకాల విధానం నుంచి దూరంగా ఉంచింది. కానీ ఇప్పుడు ట్రంప్ మనసు మార్చుకున్నారు.
ట్రంప్ తాజా భారీగా షాక్
వాస్తవానికి భారతీయ ఔషధ ఉత్పత్తులకు భారతదేశం అతిపెద్ద ఎగుమతి మార్కెట్. గత ఆర్ధిక సంవత్సరంలో భారత్ 27.9 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులు చేయగా.. ఇందులో 31​​శాతం లేదా అంటే 8.7 బిలియన్ డాలర్లు అమెరికాకు చేసినవే. అమెరికాలో వాడే జనరిక్ మందుల్లో 45 శాతం, బయోసిమిలర్ మందుల్లో 15 శాతం కంటే ఎక్కువ మనమే సరఫరా చేస్తున్నాం. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 30-50 శాతం వరకు అమెరికన్ మార్కెట్ నుండి సంపాదిస్తున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో వీరికి భారీగా షాక్ తగలబోతోంది.

భారతీయ ఫార్మా కంపెనీలపై ప్రభావం
అమెరికా మార్కెట్, భారతీయ ఔషధ కంపెనీలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా వంటి ప్రముఖ సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 30-50 శాతం వరకు అమెరికా మార్కెట్ నుండి సంపాదిస్తున్నాయి. ట్రంప్ కొత్త నిర్ణయం ఈ కంపెనీలకు భారీగా ఆర్థిక షాక్ ఇస్తుంది. భారతదేశం ప్రస్తుతం అమెరికాకు ఔషధ ఉత్పత్తులు అత్యధికంగా ఎగుమతిచేస్తున్న దేశంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో, భారత్ 27.9 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతిచేసింది. అందులో 31 శాతం, అంటే 8.7 బిలియన్ డాలర్లు అమెరికాకు ఎగుమతయ్యాయి.

READ ALSO: Donald Trump: అక్రమ వలసదారులకు రోజువారీగా జరిమానాలకు ట్రంప్ సిద్ధం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu on the pharma sector? Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump's massive tax hike

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.