📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: స్టీల్ దిగుమతులపై రెట్టింపు సుంకం: ట్రంప్ నిర్ణయం!

Author Icon By Vanipushpa
Updated: May 31, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విదేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌పై సుంకాలను రెట్టింపు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాన్ని ఏకంగా 50 శాతానికి పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పెంచిన సుంకాలు(Tarrif) జూన్ 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా వెల్లడి
“అమెరికాలోకి దిగుమతి అయ్యే స్టీల్‌పై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచబోతున్నాం. ఈ నిర్ణయం అమెరికా స్టీల్ పరిశ్రమను మరింత సురక్షితంగా ఉంచుతుంది,” అని ట్రంప్ ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అనంతరం తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో, “జూన్ 4వ తేదీ బుధవారం నుంచి స్టీల్ మరియు అల్యూమినియంపై సుంకాలను 25 శాతం నుంచి 50 శాతంకి పెంచడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన స్టీల్, అల్యూమినియం పరిశ్రమలు మునుపెన్నడూ లేనంతగా పుంజుకుంటున్నాయి. ఇది మన అద్భుతమైన స్టీల్, అల్యూమినియం కార్మికులకు మరో గొప్ప శుభవార్త. మేక్ అమెరికా గ్రేట్ అగైన్!” అని ట్రంప్ రాసుకొచ్చారు.

Trump: స్టీల్ దిగుమతులపై రెట్టింపు సుంకం: ట్రంప్ నిర్ణయం!

స్టీల్ దిగుమతులపై 25 శాతం సుంకం
అమెరికా వాణిజ్య లోటును తగ్గించి, స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన విస్తృత సుంకాల పథకంలో భాగంగా, మార్చి నెలలో చాలా వరకు స్టీల్ దిగుమతులపై 25 శాతం సుంకం విధించారు. ఈ తాజా పెంపు ఆయన వాణిజ్య విధానాల్లో కీలకమైనదిగా భావిస్తున్నారు. ఈ సుంకాల పెంపు ప్రభావం దక్షిణ కొరియా వంటి దేశాలపై ఇప్పటికే కనిపిస్తోంది. మార్చి నెలలో అమెరికాకు సియోల్ నుంచి స్టీల్ ఉత్పత్తుల ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 19 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చిలో అమెరికాకు కొరియా స్టీల్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 340 మిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా, కొరియన్ స్టీల్ తయారీదారులు కొన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. హ్యుందాయ్ స్టీల్ కంపెనీ వంటివి అమెరికాలోనే తమ ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నాయి. 2029 నాటికి లూసియానాలో 5.8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ఆధారిత స్టీల్ మిల్లును నిర్మించాలని హ్యుందాయ్ స్టీల్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది కంపెనీకి విదేశాల్లో తొలి ఉత్పత్తి కేంద్రం కానుంది.

Read Also: Trump: ట్రంప్‌ను హార్వర్డ్ తిరస్కారంతోనే ఆ వర్సిటీపై కోపమా!

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu on steel imports! Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to double tariffs Trump's decision

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.