📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Trump: హర్వర్డ్ యూనివర్శిటీకి ట్రంప్ మరో షాక్

Author Icon By Vanipushpa
Updated: May 28, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తీసుకుంటోన్న నిర్ణయాలు, జారీ చేస్తోన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికా(America) మేక్ గ్రేట్ అగైన్ కాన్సెప్ట్ కింద ప్రపంచ దేశాలపై ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ వ్యవహారం.. అక్కడి వాళ్లకే రుచించట్లేదు. దీన్ని నిరసిస్తూ ఇప్పటికే రోడ్డెక్కారు అమెరికన్లు. అదే సమయంలో- మరో వివాదం తెర మీదికి వచ్చింది. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీ(Harverd University)కి 100 మిలియన్ డాలర్ల కాంట్రాక్టులను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన సర్కులర్ ను త్వరలోనే ఫెడరల్ ఏజెన్సీలన్నింటికీ జారీ చేయనున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది.

Trump: హర్వర్డ్ యూనివర్శిటీకి ట్రంప్ మరో షాక్

2.3 బిలియన్లకు పైగా గ్రాంట్లను నిలిపివేస్తూ ఉత్తర్వులు
హార్వర్డ్ యూనివర్శిటీతో ఏఏ రంగానికి సంబంధించిన కాంట్రాక్ట్ ఒప్పందాలను కుదుర్చుకున్నామనే వివరాలను సేకరిస్తోన్నామని పేర్కొంది. వివిధ రంగాలు, విభాగాలకు సంబంధించి 100 మిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టులు దాదాపుగా 30 వరకు హార్వర్డ్ యూనివర్శిటీతో కుదుర్చుకుని ఉండొచ్చని అంచనావేసింది వైట్ హౌస్. వాటన్నింటినీ కూడా పునఃసమీక్షించాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించినట్లు వివరించింది. గతంలో హార్వర్డ్ యూనివర్శిటీకి 2.3 బిలియన్లకు పైగా మంజూరు చేయాల్సిన గ్రాంట్లను నిలిపివేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేశారు ట్రంప్. ఇప్పుడు తాజాగా 100 మిలియన్ డాలర్ల కాంట్రాక్టుల రద్దు చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకే హర్వర్డ్ యూనివర్శిటీకి షాక్ ఇచ్చింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేసింది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్‌ను రద్దు చేసింది. కొత్తగా అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడాన్ని అవకాశం లేకుండా చేసింది.
హార్వర్డ్ యూనివర్శిటీలో అడ్మిషన్లు లేవు
2025- 2026 విద్యా సంవత్సరంలో ఏ ఒక్క విదేశీ విద్యార్థి కూడా హార్వర్డ్ యూనివర్శిటీలో అడ్మిషన్లు పొందలేరు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీస్ ఆదేశాల ప్రకారం- ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు తమ విసాను కొనసాగించుకోవాలనుకుంటే మరో విద్యాసంస్థ లేదా యూనివర్శిటీకి బదిలీ కావాల్సి ఉంటుంది. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ రద్దు అంటే 2025-2026 విద్యా సంవత్సరానికి ఎఫ్ లేదా జే వలసేతర హోదాపై ఉన్న ఏ గ్రహాంతరవాసులు (విదేశీ విద్యార్థులు) హార్వర్డ్ లో అడ్మిషన్లు పొందడాన్ని నిషేధించినట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఈ మేరకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటన జారీ చేసింది. ఇప్పుడున్న విద్యార్థులను మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ చేయాలని ఇందులో పొందుపరిచింది. ఈ మేరకు ఈ ఉత్తర్వులను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీస్ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

అంతర్జాతీయ విద్యార్థులను వీసాలు రద్దు

హార్వర్డ్ యూనివర్శిటీ అధికారులు హింసాత్మక పరిస్థితులు, యూదుల పట్ల వ్యతిరేకతను పెంపొందించడం, క్యాంపస్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలను కలిగివుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. యూనివర్శిటీలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి అధిక ట్యూషన్ చెల్లింపుల నుండి ప్రయోజనం పొందడం సరికాదని చెప్పారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ, గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న అంతర్జాతీయ విద్యార్థులను వీసాలు రద్దు చేసి, వారిని దేశం నుంచి బహిష్కరించేలా గతంలో ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

Read Also: China Chemical: చైనా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Harvard University Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump's another shock

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.