📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Modi: ట్రంప్ జీ భారత్-పాక్ ఒప్పందంలో మీ జోక్యం లేదుగా..మోదీ

Author Icon By Vanipushpa
Updated: June 18, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌(Pakistan)తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా(America) పాత్రేమీ లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌(Trump)కు తేల్చి చెప్పారు. ఇద్దరి మధ్య దాదాపు 35 నిమిషాలపాటు జరిగిన ఫోన్ సంభాషణలో మోదీ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. భారత్-పాకిస్థాన్(India-Pakistan) మధ్య అప్పట్లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని మోదీ తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అలాగే, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ కావడానికి ముందు ఇద్దరి మధ్య ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Modi: ట్రంప్ జీ భారత్-పాక్ ఒప్పందంలో మీ జోక్యం లేదుగా..మోదీ

పదేపదే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ కుదర్చినట్టు ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. ఈ విషయంలో అమెరికా ప్రమేయం ఎంతమాత్రమూ లేదని సూటిగా చెప్పారు. ఆ సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వెనుక అమెరికా మధ్యవర్తిత్వం ఉందంటూ వచ్చిన వార్తలను ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ఖండించారు. కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షికమని, ఇందులో మూడో దేశ ప్రమేయం ఎంతమాత్రం లేదని ట్రంప్‌కు వివరించారు.
పాకిస్థాన్ పదేపదే అభ్యర్థించడం వల్లే ఆగిన యుద్ధం
పాకిస్థాన్ పదేపదే అభ్యర్థించడం వల్లే తాము ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేయాల్సి వచ్చిందని కూడా ప్రధాని మోదీ ట్రంప్‌కు తెలియజేశారు. ఈ విషయంలో అమెరికా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, అలాంటి ప్రమేయానికి ఆస్కారమే లేదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆ కాలంలో ఏదైనా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అటువంటిదేమీ లేదని, ఆ సమయంలో భారత్-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.

Read Also: Modi : ప్రధాని మోదీ G7కు రావడం గర్వకారణం – కెనడా ప్రధాని

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu India-Pakistan agreement Latest News in Telugu Paper Telugu News says Modi Telugu News online Telugu News Paper Telugu News Today trump you have no interference

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.