📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ఇరాన్, ఇజ్రాయెల్ లకు ట్రంప్ హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: June 24, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఇజ్రాయెల్, ఇరాన్(Israel-Iran) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) ప్రకటించారు. గత కొద్ది గంటలుగా ఇరాన్ పలు దఫాలుగా ఇజ్రాయెల్(Israel) భూభాగాలపై క్షిపణులతో దాడులు చేసిన నేపథ్యంలో, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ట్రంప్ ఇరు దేశాలను హెచ్చరించారు. “కాల్పుల విరమణ ఇప్పుడు అమల్లో ఉంది. దయచేసి దీన్ని ఉల్లంఘించవద్దు” అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Trump: ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ఇరాన్, ఇజ్రాయెల్ లకు ట్రంప్ హెచ్చరిక

పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ట్రంప్ పిలుపు

పన్నెండు రోజుల పాటు సాగిన యుద్ధానికి ముగింపు పలికేందుకు పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం సుమారు 0400 జీఎంటీ నుంచి 24 గంటల పాటు దశలవారీగా ఈ ప్రక్రియ జరుగుతుందని, తొలుత ఇరాన్ ఏకపక్షంగా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుందని, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇదే బాటలో నడుస్తుందని ఆయన ముందుగా తెలిపారు. ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగాలపై ఐదు దఫాలుగా క్షిపణి దాడులు జరిపిన అనంతరం ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా వెల్లడించింది. ఈ దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్‌లో కనీసం ఏడుగురు మరణించినట్లు సమాచారం. కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ముందు టెహ్రాన్ చివరి రౌండ్ క్షిపణులను ప్రయోగించిందని ఇరాన్‌కు చెందిన ఎస్ఎన్ఎన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము కూడా నిలిపివేస్తాం: ఇరాన్

క్షిపణి దాడులు ముగియడంతో, ప్రజలు షెల్టర్ల సమీప ప్రాంతాల నుంచి బయటకు రావచ్చని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. “పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, దేశవ్యాప్తంగా రక్షిత ప్రదేశాల సమీపంలో ఉండాలన్న నిబంధనను హోమ్ ఫ్రంట్ కమాండ్ ఎత్తివేసింది” అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో జరిపిన చర్చల ద్వారా ట్రంప్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చారని, ఇరాన్ ఇకపై దాడులు చేయనంత కాలం ఇజ్రాయెల్ దీనికి అంగీకరించిందని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఇరాన్ కూడా కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధ్రువీకరించింది. అయితే, ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము కూడా నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం, మధ్యప్రాచ్యాన్ని విధ్వంసం నుంచి రక్షించగలదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలూ ఓర్పు, ధైర్యం చూపినందుకు ఆయన ప్రశంసలు గుప్పించారు.

Read Also: Donald Trump : ట్రంప్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన ఇరాన్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu deal Google News in Telugu Iran israel Latest News in Telugu not Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to trump violate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.