📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: ఇరాన్ ట్రంప్‌ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

Author Icon By Vanipushpa
Updated: June 28, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(Ayatulla Khamenei)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఖమేనీ పట్ల అసభ్యంగా, అభ్యంతరకరంగా మాట్లాడడం మానేస్తేనే.. తమతో అణు ఒప్పందం సాధ్యమని ఇరాన్(Iran) ట్రంప్‌ను హెచ్చరించింది. ఇజ్రాయెల్‌(Israel)తో పోరులో ఇరాన్‌దే విజయమని ఖమేనీ చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ క్షిపణులకు ఇజ్రాయెల్ భయపడుతోందని, బెదిరింపులను ఇరాన్ సహించదని అరాగ్చీ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ నిజంగా కోరుకుంటే.. ఖమేనీ పట్ల అసభ్యకరమైన, అగౌరవమైన ధోరణిని మానుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది.

Trump: ఇరాన్ ట్రంప్‌ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా..
ఖమేనీ హత్యకు గురికాకుండా రక్షించామని, ఆయన కృతజ్ఞత లేనివాడని ఆరోపిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. ఇరాన్‌లో ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తనకు కచ్చితంగా తెలుసునని, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా, ఇజ్రాయెల్ దళాల చేతుల్లో ఖమేనీ జీవితం ముగియకుండా తాను నిలువరించానని వివరించారు. ఖమేనీని ఘోరమైన చావు నుంచి తానే రక్షించానంటూ ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇంత చేసినా ఖమేనీ తనకు ధన్యవాదాలు కూడా తెలుపలేదంటూ రాసుకొచ్చారు.
ఖమేనీని ట్రంప్ అగౌరవంగా సంబోధించడాన్ని ఖండించిన ఇరాన్
ఖమేనీని ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన పోస్టుపై ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ స్పందించారు. ఖమేనీని ట్రంప్ అగౌరవంగా సంబోధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ట్రంప్‌కు అణు ఒప్పందం కావాలంటే.. ఆయన ఇరాన్ అత్యున్నత నాయకుడు, సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ పట్ల అసహ్యకరమైన, ఆమోదయోగ్యం కాని వైఖరిని విడిచిపెట్టాలని అన్నారు.

ఇరాన్-ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ
ఇరాన్-ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ గురించి అరాగ్చీ మాట్లాడుతూ.. “మా క్షిపణులకు భయపడి ఇజ్రాయెల్ పాలన ‘తండ్రి’ సహాయం కోసం పరుగులు తీసిందని ప్రపంచానికి చూపించింది. గొప్ప శక్తివంతమైన ఇరానియన్ ప్రజలు బెదిరింపులు, అవమానాలను తేలికగా తీసుకోరు. భ్రమలు మరింత పెద్ద తప్పులకు దారితీస్తే, ఇరాన్ తన నిజమైన సామర్థ్యాలను బహిర్గతం చేయడానికి వెనుకాడదు” అని ఆయన హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ తన ప్రకటనలలో ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేసే విషయాన్ని తాను ఇటీవల పరిశీలించానని తెలిపారు.

Read Also: Donald Trump: 30 బిలియన్ డాలర్లు ఇస్తోందన్నవార్తలను ఖండించిన ట్రంప్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu donald trump iran Google News in Telugu iran supreme leader vs trump Iran US relations iran us tensions iran vs trump Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today trump foreign policy trump iran conflict trump iran news today trump iran nuclear deal trump iran war of words trump latest news trump middle east conflict trump middle east policy trump statements on iran trump threats to iran trump vs iran 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.