📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: పాకిస్తాన్‌లో నీటి కొరతపై ట్రంప్ ట్రోల్..నిజమేనా?

Author Icon By Vanipushpa
Updated: May 2, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా కూడా ఒక యుద్ధభూమిగా మారింది. ఒకవైపు తీవ్రమైన చర్చలు, విమర్శలు జరుగుతుంటే, మరోవైపు మీమ్స్, హాస్యభరితమైన వ్యాఖ్యలతో నిండిపోయింది.
“అహ్.. అహ్… నాకు నీళ్లు కావాలి…
ఈ నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సింధు ఒప్పందంపై భారత్ కఠినంగా వ్యవహరించడం వల్ల పాకిస్తాన్‌లో నీటి కొరత ఏర్పడిందని, దానిపైనే ట్రంప్ ఆ దేశాన్ని ఎగతాళి చేస్తున్నారని ఈ వీడియోతో పాటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది? వైరల్ అవుతున్న క్లిప్‌కు “నీటిపై డొనాల్డ్ ట్రంప్ మొత్తం పాకిస్తాన్‌ను ఆటపట్టించారు అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో ట్రంప్ తీవ్రంగా దాహంతో ఉన్నట్లు నటిస్తూ, “అహ్.. అహ్… నాకు నీళ్లు కావాలి… సహాయం చేయండి… నాకు నీళ్లు కావాలి” అని చెబుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు, సింధు నదీ జలాలను భారత్ ఆపేయడం వల్ల పాకిస్తాన్ నీటి కొరతతో అల్లాడుతోందని, దాన్ని చూసే ట్రంప్ ఇలా ఎగతాళి చేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు. బీజేపీ నాయకుడు తేజీందర్ బగ్గాతో సహా చాలా మంది ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో షేర్ చేశారు.

సింధు నదీ జలాల సమస్యను లక్ష్యంగా చేసుకున్నది కాదు
అసలు ప్రశ్న ఏమిటంటే ట్రంప్ నిజంగానే నీటి కొరతపై పాకిస్తాన్‌ను ఎగతాళి చేశారా? అని చర్చించుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు. సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతున్న ఈ క్లిప్ పూర్తిగా సందర్భానికి సంబంధం లేనిది . ట్రంప్ చేసిన ఆ హాస్యభరితమైన, దాహంతో ఉన్నట్లు కనిపించేది.. పాకిస్తాన్‌ను లేదా సింధు నదీ జలాల సమస్యను లక్ష్యంగా చేసుకున్నది ఎంతమాత్రం కాదు.
ట్రంప్ పాకిస్తాన్‌ను ఎగతాళి చేస్తున్నారని ప్రచారం అవుతున్న ఈ వీడియో, వాస్తవానికి చాలా పాతది అని, ఇది 2013 నాటిది అని తేలింది. అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా రాజకీయ నాయకుడు మార్కో రూబియోను ఎగతాళి చేస్తూ సమయంలోనిది ఈ వీడియో ఇది.
సోషల్ మీడియాలో ఏది పడితే అది నమ్మేయడం చాలా ప్రమాదకరం
2013లో, మార్కో రూబియో ఒక ప్రసంగం మధ్యలో నీళ్లు తాగడానికి ఆగారు. దీన్ని డొనాల్డ్ ట్రంప్ పట్టుకుని, రూబియోను “చోక్ ఆర్టిస్ట్” అని పిలిచి తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు, రూబియో నీళ్లు తాగిన విధానాన్ని ఎగతాళి చేస్తూ, ట్రంప్ స్వయంగా నీటి సీసాను పట్టుకుని, నాటకీయంగా ఒక గుటక వేసి, ఆపై నీళ్లను తన భుజంపై నుంచి అజాగ్రత్తగా విసిరేసినట్లు నటించారు. ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్ ఆ నాటకీయ నటనలో ఒక భాగం మాత్రమే. కాబట్టి, వైరల్ అవుతున్న ఈ క్లిప్ సందర్భానికి పూర్తిగా సంబంధం లేనిది. ఇందులో పాకిస్తాన్ గురించి కానీ, సింధు ఒప్పందం గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదు.

ఇది కేవలం పాత వీడియో క్లిప్‌

ఇది కేవలం పాత వీడియో క్లిప్‌ను సందర్భం లేకుండా తీసుకుని, భారత్ , పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కోసం వాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది నమ్మేయడం చాలా ప్రమాదకరం, ముఖ్యంగా ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో. ఒక వీడియో లేదా పోస్ట్ షేర్ చేసే ముందు, దాని వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో నిర్ధారించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. లేదంటే తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించి అనవసరమైన అపోహలు, ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఈ ‘ట్రంప్ వీడియో’ కూడా అలాంటి తప్పుడు సమాచార ప్రచారంలో భాగమే తప్ప, అందులో పాకిస్తాన్‌ను ఎగతాళి చేసే ఉద్దేశానికి సంబంధించినది కాదని తేలింది.

Read Also: Trump Removes Mike: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్​ వాల్జ్​పై వేటు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu is it true? Latest News in Telugu over water shortage Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump trolls Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.