📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Trump Towers: ట్రంప్ టవర్స్ సెన్సేషన్.. ఓపెనింగ్ రోజే రికార్డ్ సేల్స్

Author Icon By Vanipushpa
Updated: May 14, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రియల్ ఎస్టేట్ మార్కెట్ (Real Estate Market) పడిపోతుందని భావిస్తే మీరు పొరబడినట్లే. అవును… తాజాగా ట్రంప్ టవర్స్(Trump Towers) ప్రారంభం జరిగింది. విశేషం ఏంటంటే గురుగ్రామ్‌లో నిర్మించిన ఈ ట్రంప్ టవర్స్ లోని 298 లగ్జరీ ఫ్లట్లన్నీ ఓపెనింగ్ రోజే అమ్ముడయ్యాయి. వీటి ధర రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్య ఉంటుంది. ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటి అంటే మొదటి రోజే రూ.3250 కోట్ల విలువైన బుకింగ్‌లు జరిగాయి. ఇందులో రూ.125 కోట్ల విలువైన నాలుగు పెంట్‌హౌస్‌లు కూడా ఉన్నాయి. గురుగ్రామ్‌లోని ట్రంప్ టవర్స్’ని స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్ అండ్ ట్రిబెకా డెవలపర్స్ ఉమ్మడిగా అభివృద్ధి చేశాయి.
ఈ ప్రాజెక్ట్ గురుగ్రామ్‌లో ట్రంప్ బ్రాండ్ రెండవ హౌస్ కంస్ట్రక్షన్ ప్రాజెక్ట్. న్యూయార్క్ తర్వాత రెండు ట్రంప్ టవర్లు ఉన్న మొదటి నగరం గురుగ్రామ్. సెక్టార్-69లో ఉన్న ట్రంప్ టవర్స్ లో రెండు 51 అంతస్తుల టవర్లు ఉన్నాయి, వీటిలో 298 లగ్జరీ ఇళ్ళు ఉండగా, ఒక్క ఇంటి ధర రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్య ఉంటుంది.

Trump Towers: ట్రంప్ టవర్స్ సెన్సేషన్.. ఓపెనింగ్ రోజే రికార్డ్ సేల్స్

‘ట్రంప్ టవర్స్’కి అద్భుతమైన స్పందన
స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్ (Pankaj Bansal) మాట్లాడుతూ ‘ట్రంప్ టవర్స్’కి లభించిన అద్భుతమైన స్పందన దేశంలో ప్రపంచ స్థాయి లైఫ్ స్టయిల్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం మాకు గర్వకారణం ఇంకా మా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించినందుకు వారికి ధన్యవాదాలు’ అని అన్నారు. గురుగ్రామ్‌లోని ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ సేల్స్ చదరపు అడుగుకు రూ.27,000 చొప్పున మొదలవుతుంది. ఇందులో ప్రత్యేక ఇంటీరియర్ డిజైన్, ప్రైవేట్ లిఫ్ట్, విలాసవంతమైన క్లబ్‌హౌస్ ఇంకా ప్రత్యేకమైన సేవలు ఉన్నాయి.
బ్రాండ్ పేరుకు ప్రత్యేక ఆకర్షణ
‘ట్రంప్’ అనే బ్రాండ్ పేరుకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. అందుకే ప్రపంచం నలుమూలల నుండి కొనుగోలుదారులు దీనిని ప్రత్యేకమైన ఇంకా కాస్ట్లీ ప్రాజెక్టుగా భావిస్తారు. ఈ ప్రాజెక్టులో మొత్తం అమ్మకానికి ఉన్న విస్తీర్ణం 12 లక్షల చదరపు అడుగులు. దీనికి పూర్తిగా గాజు గోడలు, కొన్ని ఇళ్లలో రెట్టింపు ఎత్తు గల లివింగ్ రూములు, పెద్ద పెద్ద పైకప్పు వరకు కిటికీలు, ప్రైవేట్ లిఫ్ట్, ఆరావళి కొండల దృశ్యాలతో కూడిన షేర్డ్ టెర్రస్ ఉంటాయి.
గురుగ్రామ్‌లోని సెక్టార్ 65లో ఇప్పటికే నిర్మించిన ట్రిబెకా టవర్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్. ఇందులో 22 అడుగుల డబుల్ సీలింగ్ ఎత్తు ఉన్న గదులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో దేశంలోనే మొట్టమొదటి ఇండోర్ పూల్ ఉంది. ఈ ప్రాజెక్టులో 51 అంతస్తుల ఎత్తు ఉన్న రెండు టవర్లు ఉన్నాయి. వీటిలో ఒకదాని ఎత్తు 200 మీటర్ల కంటే పైగా ఉంటుంది.

Read Also: Kashish Chowdhary: బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా హిందూ యువతి చరిత్ర

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Record sales on opening day Telugu News online Telugu News Paper Telugu News Today Trump Towers sensation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.