అమెరికా అధ్యక్షుడు(America President) మరో కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలపై టారీఫ్(Tariff)ల పేరుతో పన్నులు భారం మోపుతుండగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్రిక్స్(Brics) అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ (Trump)హెచ్చరించారు.
ట్రంప్ కీలక వ్యాఖ్యలు – Truth Social లో ప్రకటన
ఈమేరకు తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10శాతం టారిఫ్‌లు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉందని సోమవారం ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. బ్రిక్స్ అనుకూల దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇస్తున్నాయంటూ, వాటిపై అదనపు 10% టారీఫ్‌లు విధించనున్నట్టు ప్రకటించారు. బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నవేళ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. రియో డి జనీరో నగరంలో ఈ సదస్సు ప్రారంభమైంది. ఇందులో భారత ప్రధాని మోదీ సహా పలువురు దేశాధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
కొత్త సుంకాలు – అమలులోకి వచ్చే తేదీ మారింది
మునుపుగా జూలై 9 నుంచి కొత్త టారీఫ్‌లు అమలులోకి వస్తాయని ట్రంప్ ప్రకటించగా, తాజాగా వాటిని ఆగస్ట్ 1కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ అధికారికంగా జూలై 7న వెల్లడించారు. ఈసందర్భంగా అమెరికా విధానాలను ఉద్దేశిస్తూ సుంకాల అంశాన్ని వారు ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు తెలుస్తోంది. అటు నూతన సుంకాలు జులై 9 నుంచి అమల్లోకి వస్తాయని గతంలో ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడు ఆ దీని వాయిదా వేశారు. అవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని జూలై 7న అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Bonalu: బహ్రెయిన్‌లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు