భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ప్రకటించుకుంటున్న ఆయన తొలిసారి, క్రెడిట్ తీసుకోకుండా మాట్లాడారు. రెండు దేశాల నాయకులు చాలా స్మార్ట్‌గా నిర్ణయం తీసుకుని, అణు యుద్ధం జరగకుండా కాపాడారని తెలిపారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్(Munir)కు శ్వేతసౌధంలో ట్రంప్ బుధవారం విందు ఇచ్చిన ట్రంప్, పాకిస్థాన్ అంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి అని తెలిపారు. మోదీతో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసిన ట్రంప్, భారత్‌తో అమెరికా(America) వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వివరించారు.
రెండు ప్రధాన అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను: ట్రంప్
“యుద్ధాన్ని నేనే ఆపాను. పాకిస్థాన్(Pakistan) అంటే నాకు ఇష్టం. ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి. మోదీతో ఫోన్‌లో మాట్లాడాను. భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నాం. పాకిస్థాన్-భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను. ఆయన (పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్) చాలా ప్రభావవంతమైన వ్యక్తి. పాకిస్థాన్ వైపు నుంచి ఆయన, భారత్ తరఫున మోదీ, ఇతరులు యుద్ధానికి తెరదించేందుకు చొరవ చూపారు. రెండు ప్రధాన అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను. ఈ అంశంపై నేనేమీ కథ రాయాలని భావించడం లేదు. నేను యుద్ధాన్ని ఆపాను అంతే. ఈ అంశంపై మీరు ఎవరైనా కథ రాశారా? అని ట్రంప్ అన్నారు.
మునీర్‌కు ట్రంప్ విందు – అరుదైన గౌరవం
అయితే, ఒక దేశానికి చెందిన ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు విందు ఇవ్వడం చాలా అరుదైన విషయమని విశ్లేషకులు అంటున్నారు. అంతకుముందు అయూబ్ ఖాన్, జియా ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి వారికి ఆహ్వానం అందినప్పటికీ వాళ్లు పాకిస్థాన్ అధ్యక్షులుగా ఉన్నారు. తాజాగా మునీర్‌కు అమెరికా నుంచి ఆహ్వానం అందడాన్ని పాకిస్థాన్ అధికారులు తమ దౌత్య విజయంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. తలుపులు మూసి ఉంచిన గదిలో ఇరువురు విందు చేసినట్లు సమాచారం.
ఓవైపు ఇరాన్‌కు పాకిస్థాన్‌కు సన్నిహత దేశం కావడం, మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కు ట్రంప్ వైట్ హౌస్‌లో విందు ఇచ్చినట్లు సమాచారం. ఒక దేశానికి చెందిన ఆర్మీ చీఫ్‌కు అమెరికా అధ్యక్షుడి తరఫున విందు ఇవ్వడం చాలా అరుదైన privileage. గతంలో అయూబ్ ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ వంటి నేతలే ఈ గౌరవాన్ని పొందారు, అయితే వారు అందరూ పాక్ అధ్యక్షులుగా ఉన్న సమయంలో జరిగినది.
Read Also: Israel-Iran : తగ్గుతున్న ఇజ్రాయెల్ గగనతల రక్షణ నిల్వలు