📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: విద్యాశాఖను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు

Author Icon By Vanipushpa
Updated: March 21, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ విద్యాశాఖను రద్దు చేస్తూ ఆయన గురువారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ చర్యతో ఫెడరల్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ శాశ్వతంగా మూసివేయబడనుంది.
“విద్యను రాష్ట్రాలకు అప్పగించాలి” – ట్రంప్ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, “విద్యాశాఖ మాకు అవసరం లేదు.. విద్యను పూర్తిగా రాష్ట్రాల నియంత్రణలోకి తరలించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. ఫెడరల్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా రాష్ట్రాలు విద్యను నిర్వహించగలవని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ మూసివేత నిర్ణయంతో అమెరికాలోని పాఠశాలలకు ఫెడరల్ నిధుల సహాయం నిలిచిపోనుంది. ప్రధానంగా తక్కువ ఆదాయం గల పాఠశాలలు, ప్రత్యేక అవసరాల విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితం అవుతారు. ట్రంప్ నిర్ణయంపై డెమొక్రాట్లు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఇది నిరంకుశత్వానికి, అధికారి దుర్వినియోగానికి నిదర్శనం అని వారు ఆరోపించారు. డెమొక్రాట్ సెనేటర్ చక్ షుమెర్ మాట్లాడుతూ, “ఇది ఒక విధ్వంసకరమైన, వినాశకరమైన నిర్ణయం” అని వ్యాఖ్యానించారు.

రిపబ్లికన్ నేతల మద్దతు
ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్, టెక్సాస్ గవర్నర్ గ్రెబ్ అబోట్ తదితర రిపబ్లికన్ నేతలు మద్దతు తెలిపారు. ఈ చర్య ద్వారా అమెరికా డబ్బును ఆదా చేయడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం సాధ్యమవుతుందని ట్రంప్ వాదించారు.
విద్యాశాఖ చిట్టచివరి మంత్రి మెక్‌మహన్
ట్రంప్ ఇటీవల ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ మాజీ సీఈఓ మెక్‌మహన్‌ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు. అయితే, ఆమెనే ఆ శాఖకు చివరి మంత్రిగా మార్చడం గమనార్హం.
అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ప్రైమరీ, సెకండరీ విద్యకు కేవలం 13% నిధులు మాత్రమే అందిస్తుంది. మిగతా నిధులను రాష్ట్రాలు, స్థానిక కమ్యూనిటీలు సమకూరుస్తాయి. అయితే, ఫెడరల్ ప్రభుత్వం విద్యార్థుల పౌర హక్కుల రక్షణలో కీలక భూమిక వహిస్తుంది. ట్రంప్ తీసుకున్న విద్యాశాఖ మూసివేత నిర్ణయం అమెరికాలో విద్యావ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది.

"Telugu News Ap News in Telugu Breaking News in Telugu Department of Education Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Trump orders abolishing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.