📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Remittance: రెమిటెన్స్ పై 5 శాతం పన్ను విధిస్తూ ట్రంప్ ఆదేశాలు

Author Icon By Vanipushpa
Updated: May 17, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America)కు వెళ్లి డబ్బు సంపాదించాలి అని భారత్(India) లో చాలా మంది యువత కల. వీరిలో మధ్య తరగతి కుటుంబం నుంచే అనేక మంది యువత అగ్రరాజ్యానికి క్యూ కడుతుంటారు. ఏదోపని చేసి ఇంటికి డబ్బు పంపించాలనేది వారి లక్ష్యం. అయితే అలాంటి లక్షల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. అమెరికాలో విదేశాలకు పంపే డబ్బు(రెమిటెన్స్)(Remittance)పై పన్ను పెంచుతూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రెమిటెన్స్ (Remittance)పై 5 శాతం పన్ను విధిస్తూ ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికా యేతర పౌరులపై భారం మోపే దిశగా ట్రంప్‌ సర్కార్‌ ఈ చర్యలు తీసుకుంది.

Remittance: రెమిటెన్స్ పై 5 శాతం పన్ను విధిస్తూ ట్రంప్ ఆదేశాలు

అమెరికా పౌరసత్వం పొందిన వారిపై ఎలాంటి పన్ను లేదు

ట్రంప్ నిర్ణయంతో అమెరికాలోని భారతీయులు తల పట్టుకున్నారు. తమ ఇళ్లకు డబ్బు పంపే ఎన్నారై లపై ప్రత్యక్ష ప్రభావం పడుతున్న క్రమంలో భారతీయులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు గ్రీన్ కార్డ్ హోల్డర్ (Green Card Holders) లేదా H1B వీసాపై పని చేయడానికి అక్కడికి వెళ్లిన ప్రతి విదేశీయుడికి ఈ నిర్ణయం వర్తించనున్నట్లు సమాచారం. ఇక అమెరికా పౌరసత్వం పొందిన వారిపై ఎలాంటి పన్ను ఉండదని సమాచారం.
4 కోట్ల మంది వలసదారులపై ప్రభావితం
ట్రంప్ తీసుకోనున్న ఈ నిర్ణయం కారణంగా దాదాపు 4 కోట్ల మంది వలసదారులు ప్రభావితం అవుతారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో లక్షలాదిమంది భారతీయులు ఉన్నారు. వీరంతా వివిధ స్టడీస్ కారణంతో అమెరికాకు వెళ్లారు. వీళ్లపై ఈ రెమిటెన్స్ ప్రభావం పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
టాప్ ప్లేస్ లో భారత్
ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం అమెరికా నుంచి భారత్ కు అందుతున్న రెమిటెన్స్ గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. 2010లో 55.6 బిలియన్‌ డాలర్లు గా ఉన్న రెమిటెన్స్.. 2023-24 నాటికి 118.7 బిలియన్ డాలర్లకు ఎగబాకినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. మరోవైపు వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారం అత్యధిక రెమిటెన్స్ లు అందుకుంటున్న దేశాల్లో భారత్ టాప్ ప్లేస్ లో ఉంది. 2024 నివేదిక ప్రకారం అమెరికాలో 50 లక్షలకు పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య ప్రతిఏటా గణనీయంగా పెరుగుతున్నట్లు అమెరికా సెన్సస్ బ్యూరో పేర్కొంది.

Read Also: Pakistan on Kashmir Issue: చర్చలకు సిద్ధంగా వున్నాం.. పాకిస్థాన్ ప్రధాని

#telugu News 5 percent tax on Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News remittances Telugu News online Telugu News Paper Telugu News Today Trump orders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.